'అజ్ఞాతవాసి' సినిమాతో వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచే భారీ బజ్ నెలకొంది. తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని పవన్ అభిమాన లోకం కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురు చూసింది. అయితే అంతగా ఎదురుచూసిన ఆ క్షణం వచ్చిరాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లడంతో సీఎం జగన్‌పై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రీమియర్ షో, బెన్‌ఫిట్ షోల్లోనే తమ అభిమాన తార పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' చూసేయాలని ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. కరోనా ఎఫెక్ట్ ఉందన్న కారణంతో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించింది ఏపీ గవర్నమెంట్. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బెనిఫిట్ షోలు పడలేదు. ఎంతో ఆశగా థియేటర్స్ వద్దకు వచ్చిన ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. ఏకంగా ‘వకీల్ సాబ్' ప్రదర్శితం అయ్యే థియేటర్లపై రాళ్ల దాడికి దిగి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు. 'బాగా హర్ట్ చేశారు, పీకే ఫ్యాన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాం' అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. రాజకీయాలను, సినిమాలను వేరువేరుగా చూడాలని, ఇది కక్ష్య సాధింపు చర్యనే అంటూ కోపోద్రిక్తులవుతున్నారు పవన్ ఫ్యాన్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s3l4H5
No comments:
Post a Comment