దేశంలో మహమ్మారి మరోసారి వీరవిహారం చేస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా కనిపిస్తోంది. నిత్యం చోటుచేసుకుంటున్న వేలాది మరణాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితులపై ఎమోషనల్ అయింది గ్లోబల్ బ్యూటీ . అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. ప్రెజెంట్ సామజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులు, వీడియోలను చూసి గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కరోనా కల్లోలంలో చిక్కుకున్న భారత దేశానికి సాయం అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర ప్రభుత్వ అధికారులను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసింది ప్రియాంక. భారత్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు సరఫరా చేయాలని అమెరికా ప్రభుత్వ అధికారులను కోరుతున్నా అంటూ ప్రియాంక ట్వీట్ చేసింది. 550 మిలియన్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్స్ అమెరికా ఆర్డర్ చేసిందని, అమెరికాకు కావాల్సిన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్లు వారి వద్ద ఉన్నాయని.. ప్రస్తుతం భారత్ చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి వెంటనే ఇండియాకువ్యాక్సిన్ పంపించగలరా? అని తన ట్వీట్‌లో పేర్కొంది ప్రియాంక. ఇప్పటివరకు 45 ఏళ్ళ వయసు దాటిన వారికి కోవిడ్ టీకాలు వేశారు. ఇకపై వారితో పాటు 18 ఏళ్ళ వయసు పైబడిన అందరికీ కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ జరగనుంది. అందుకు వైద్య అధికారులతో కలిసి ఆరోగ్య శాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూసి కరోనాను నియంత్రణలోకి తీసుకురాగల ఏకైక మార్గం టీకాలు మాత్రమే అంటున్నారు పలువురు వైద్య నిపుణులు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u1zgC1
No comments:
Post a Comment