మీ స్కిట్లలో అవి తప్పా ఏమీ ఉండవు.. పరువుదీసిన నెటిజన్.. గెటప్ శ్రీను రిప్లై వైరల్

బుల్లితెరపై షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతటి ట్రోలింగ్‌కు గురైనా, డబుల్ మీనింగ్స్ ఎక్కువయ్యాయ్.. శృతి మించిపోతోందని టార్గెట్ చేసినా కూడా జబర్దస్త్ మాత్రం దూసుకుపోతూనే ఉంది. టీఆర్పీల్లో జబర్దస్త్ షో దుమ్ములేపేది. అయితే ఇందులో టీం లీడర్లు మాత్రం ఒక్కొక్కరు తమకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నారు. ఒక్కో టాపిక్‌ను ఎంచుకుంటూ వారి శైలిలో స్కిట్లు వేస్తుంటారు. అలా సుధీర్ టీంలో గెటప్ శ్రీను, రాం ప్రసాద్ వంటి వారంతా సందడి చేస్తుంటారు. వీరు చేసే స్కిట్లలో ఓ కాన్సెప్ట్ అంటూ ఏమీ ఉండదు. నలుగురు అబ్బాయిలు కలిసి ముచ్చట్లు పెడితే ఎలా ఉంటుందో అలా సింపుల్‌గా లాగించేస్తుంటారు. అందులోనూ విభిన్న పాత్రలు వేస్తూ అందరినీ మెప్పిస్తుంటారు. అలాంటి గెటప్ శ్రీను తాజాగా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. గెటప్ శ్రీను ఇప్పుడు బుల్లితెర మీదే కాకుండా వెండితెరపైనా దూసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.అర డజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా సినిమాతో సోలో హీరోగా లక్‌ను పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే వదిలిన ఫస్ట్ గ్లింప్స్ ఓ అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను వేసే స్కిట్లపై కామెంట్ చేస్తూ పరువుదీసేశారు. మామూలుగా సుధీర్ టీం వేసే స్కిట్లలో ఓ ఎండ్ అంటూ సరిగ్గా ఉండదు. అందరూ కొట్టేసుకుంటూ స్కిట్‌ను ముగించేస్తుంటారు. ఇదే విషయంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. మీ స్కిట్‌కి ఒక సరైన ముగింపు ఉండదు ఏంటో.. లాస్ట్‌లో కొట్టేసుకుంటారు.. ముందంతా బాగానే ఉంటుంది అని చెప్పుకొచ్చారు. దీనికి గెటప్ శ్రీను స్పందిస్తూ.. సరే ఇక నుంచి మంచి ముగింపు ఉండేలా చూసుకుంటాం థ్యాంక్స్ అని కూల్‌గా రిప్లై ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3314YDP

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts