యాంకర్ శ్యామల, బుల్లితెర నటుడు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ చేసిన ఫిర్యాదుతో ఇష్యూ మొదలైంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన లక్ష్మీ నరసింహా రెడ్డి.. బెయిల్‌పై బయటకు వచ్చి ఈ కేసు విషయమై స్పందించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని.. నిజానిజాలతో త్వరలోనే అందరి ముందుకొస్తానని లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా రియాక్ట్ అయ్యారు. ఈ వీడియోను శ్యామల తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలు, వాటిని ఎలా తప్పుదోవ పట్టించారు అనే విషయాలన్నీ మీ ముందుంచుతానని లక్ష్మీ నరసింహా రెడ్డి చెప్పారు. ''నాపై ఎన్నో మోసపూరిత ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కూడా నాకు అండగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఆ దేవుడి దయ వల్ల నేను ఇంటికి తిరిగి వచ్చాను. నేను రెండు రోజుల్లోనే బయటకు రావడం అనేది ఇదొక తప్పుడు కేసు అనడానికి నిరూపణ. కొన్నిసార్లు నిందలను కూడా భరించాల్సి వస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అన్ని నిజానిజాలను మీతో పంచుకోవడానికి మరికొన్ని రోజుల్లో మీ ముందుకు వస్తాను. అన్ని ఆధారాలతో మిమ్మల్ని కలుస్తాను. న్యాయం, న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది'' అని అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vwcPFv
No comments:
Post a Comment