సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయ్యే అంశం . టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ కావడంతో అమ్మడి పెళ్లి తంతుపై సినీ లోకం ఎప్పటినుంచో కన్నేసింది. గత కొన్ని నెలలుగా పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో అనుష్క తన సినిమాలు కూడా తగ్గించుకోవడంతో పెళ్లి కోసమే ఇదంతా అనే ప్రచారాలు కూడా జోరుగా నడిచాయి. ఈ క్రమంలోనే తాజాగా స్వీటీ పెళ్లిపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. 1981 సంవత్సరంలో జన్మించిన అనుష్క.. గత 15 ఏళ్ల క్రిందట 'సూపర్' సినిమాతో పరిచయమై టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. వెండితెరపై స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత యంగ్ హీరో ప్రభాస్‌తో అనుష్క డేటింగ్ చేస్తోందని, ఆయనతో పెళ్లి కూడా కన్ఫమ్ అయిందనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఈ వార్తలను అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరూ ఖండించడంతో వాటికి ఫుల్స్టాప్ పడింది. కాకపోతే అనుష్క పెళ్లి మ్యాటర్ మాత్రం జనం నోళ్ళలో నానుతూనే ఉంది. ఆ మధ్యకాలంలో టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతుందనే కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది. ఈ పరిస్థితుల నడుమ లాంగ్ గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం సినిమాతో మరోసారి వెండితెరపై మెరిసిన అనుష్కకు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఇక అనుష్క ఇంటికే పరిమితమైందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు అనుష్క పెళ్లిపై ఫోకస్ పెట్టారట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టడంతో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. దీంతో అనుష్కకు సరైన జోడీ కోసం వేట మొదలుపెట్టిన ఆమె తల్లిదండ్రులు.. ఓ దుబాయ్ వ్యాపారవేత్త కొడుకుతో సంబంధం కుదిర్చారట. దీనికి అనుష్క కూడా ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆ కుర్రాడు అనుష్క కంటే వయసులో చిన్నవాడట. సో.. అనుష్క నుంచి గానీ, ఆమె టీం నుంచి గానీ రెస్పాన్స్ వస్తే తప్ప ఈ వార్తల్లో నిజానిజాలు ఏంటనేది చెప్పలేం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32X7RVV
No comments:
Post a Comment