Saaho: సినిమా తీసి తప్పుచేశానా.. బయటికి రాలేకపోతున్నా: సుజీత్

యంగ్ రెబెల్ స్టా్ర్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల కానంత వరకు ఉన్న హైప్ తీరా రిలీజ్ అయ్యాక లేదని చాలా మంది విమర్శించారు. దాదాపు రూ.350 కోట్లు పెట్టి సినిమా తీస్తే దాని వెనకున్న కష్టాన్ని మరికొందరు సొంత రివ్యూలతో ఏకిపారేశారు. చిన్న వయసులోనే ఇంతటి భారీ చిత్రాన్ని తన భుజాలపై వేసుకున్న సుజీత్‌ను అభినందించాల్సింది పోయి ప్రభాస్‌లాంటి హీరో పేరును రాంగ్ ఐడియాస్‌తో చెడగొట్టావ్ అంటూ తిట్టిపోసినవారూ ఉన్నారు. దాంతో సుజీత్‌ను ఆవేశం కట్టలు తెంచుకుంది. ‘ఈ సినిమా తీయడమేనా నేను చేసిన తప్ప’ అంటూ తనలోని ఆవేదనను వెళగక్కారు. ప్రభాస్, నిర్మాతలపై నమ్మకంతో సాహో సినిమా చేశానని అన్నారు. సినిమా చూడటానికి ఎందరో ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చినప్పటికీ తాను బాధితుడిగా మిగిలిపోయానని అంటున్నారు. తనపై ఇంత దారుణంగా కామెంట్లు చేయడానికి తానేమీ నేరం చేయలేదంటూ బాధపడ్డారు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లు రాబట్టింది. తనపై వస్తున్న వార్తలన్నీ తనను ఎందకూ పనికిరానివాడిగా ఫీలయ్యేలా చేస్తున్నాయని అంటున్నారు. ‘సాహో’ సినిమా విడుదలయ్యాక ఓ ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నో కామెంట్స్ అన్నందుకు దానిని కూడా వివాదాస్పదం చేసేశారని బాధపడ్డారు. ‘బిహార్ అభిమానులు నా కోసం గుడి కట్టించాలని నేను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ నేను అని ఉంటే అందుకు సాక్ష్యం మీ వద్ద ఉందా? అసలు సినిమాతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఈ కామెంట్స్‌ చేశారు. అయినా నేను అలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఎలాంటి అర్ధం ఉండదు. రజనీకాంత్ సర్, మమ్ముట్టి సర్‌ల కోసం మందిరాలు కట్టించాలి. కానీ నేను అలాంటివాటికి అర్హుడిని కాను. ఎందరో గొప్ప నటులు ఉన్న ఈ చిత్ర పరిశ్రమ అనే ఆలయంలో నేను కేవలం భక్తుడిని మాత్రమే. నాపై వస్తున్న ఈ నెగిటివిటీని తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను’ అని చెప్పుకొచ్చారు సుజీత్. సుజీత్ అన్న మాటల్లోనూ నిజం ఉంది. సినిమాను బాగా తీయలేదని అంతటి భారీ బడ్జెట్ సినిమా గురించి తేలికగా మాట్లాడటం, తప్పందా సుజీత్‌నేనని తనను నోటికొచ్చిన మాటలు అనడం సబబు కాదు. సినిమా నిజంగా బాలేకపోతే పెట్టిన బడ్జెట్‌ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టేది కాదు కదా? పైగా అతనేమీ పెద్ద పేరున్న దర్శకుడు కాదు. షార్ట్ ఫిలింస్ చేసి తనకు విభిన్నంగా అనిపించిన కథలతో సినిమాలు చేస్తున్న సమయంలో అతనిలో ఏదో టాలెంట్ దాగి ఉంది అని గుర్తించిన ప్రభాస్‌ సుజీత్‌కు ఇంతటి భారీ చిత్రాన్ని అప్పగించారు. మరి అలాంటప్పుడు సుజీత్‌ది ఎంత తప్పు ఉందో ప్రభాస్‌ది కూడా అంతే తప్పు ఉన్నట్లు కదా..!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/304rwzh

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts