ఎంత సీరియస్‌గా ఉన్నవారినైనా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఇట్టే నవ్వించేస్తాడు ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ. ఆయన హోస్ట్ చేస్తున్న కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’. ఈ షోకు ఎన్నో ఏళ్లుగా విపరీతమైన పాపులారిటీ ఉంది. కాగా.. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ హాజరయ్యారు. తాను కథానాయికగా నటించన ‘ది స్కై ఈజ్ పింక్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోకు హాజరై కపిల్‌తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కపిల్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘నీకు రూ.200 కోట్లు కావాల? లేక అమ్మాయిలతో కలిసి మాల్దీవ్స్‌కి ఫ్రీ ట్రిప్ కావాల? రెండింట్లో దేనిని ఎంచుకుంటావ్?’ అని ప్రశ్నించారు. ఇందుకు కపిల్ స్పందిస్తూ.. ‘నాకు రూ.200 కోట్లు కావాలి. ఎందుకంటే నేను చీప్ టికెట్‌పై మాల్దీవ్స్‌కు వెళ్లడానికి అమ్మాయిలను తెచ్చుకోగలను’ అని సమాధానమిచ్చారు. దాంతో ప్రియాంక చోప్రాతో పాటు అక్కడున్నవారంతా షాకై పగలబడి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన బిట్వీన్ ది షూట్ వీడియోను కపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఇది కాస్తా తెగ వైరల్ అవుతోంది. మిగతా ఎపిసోడ్లకు సంబంధించిన వీడియోలు కూడా కావాలంటూ నెటిజన్లు కపిల్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో కపిల్ శర్మ షోకు బీభత్సమైన టీఆర్‌పీ రేటింగ్స్ వస్తుంటాయి. గతంలో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ పేరుతో మొదలైన ఈ షోకు మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రముఖ మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ జడ్జ్‌గా వ్యవహరించేవారు. ఇందులో బాలీవుడ్ కమెడియన్ సునీల్ గ్రోవర్ మషూర్ గులాటి అనే కామెడీ వైద్యుడి గెటప్‌ను వేసేవారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ షో మూడు పువ్వులు ఆరు కాయలుగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. దాదాపు పదికి పైగా అవార్డులను దక్కించుకుంది. కానీ ఓసారి సునీల్, కపిల్ కలిసి ఓ ఈవెంట్ కోసం ఫారిన్ టూర్‌కి వెళ్లారు. ఆ సమయంలో సునీల్ కపిల్ కంటే ముందు ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నాడని అతనిపై కోపం వచ్చి చెప్పుతో కొట్టాడు కపిల్. నోటి కొచ్చిన బూతులు తిట్టాడు. దాంతో సునీల్ గ్రోవర్ ఈ షో నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆ తర్వాత కపిల్ కొన్నాళ్ల పాటు ఆల్కహాలిజంతో బాధపడ్డాడు. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు అమెరికా వెళ్లాడు. కోలుకున్నాక భారత్ వచ్చి తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ‘ది కపిల్ శర్మ షో’తో మళ్లీ ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చాడు. ఈ షోకు రావాలని ఎందరో సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mVEstW
No comments:
Post a Comment