ప్రముఖ తమిళ నటుడు సూర్యది నిజంగానే బంగారంలాంటి మనసు. సినిమాలకు సంతకం చేశామా వచ్చామా షూటింగ్‌లో పాల్గొని వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా సెట్స్‌లోని అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. వారి కష్టసుఖాలను పంచుకుంటారు. అంతేకాదు తాను చేసే సినిమా తన మనసుకు దగ్గరైందనిపిస్తే చిత్రబృందానికి కానుకలు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ప్రస్తుతం ‘సూరారి పొట్రు’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా.. ఈ సినిమా చిత్రబృందానికి సూర్య అదిరిపోయే కానుక ఇచ్చారు. దాదాపు 150 మందికి 8 గ్రాములు ఉన్న బంగారు కాయిన్స్ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. తాను నిర్మిస్తున్న సినిమా కావడంతో యూనిట్ సభ్యులు మరింత ఆసక్తిగా సినిమా కోసం పనిచేయాలని ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారన్నమాట. అంతేకాదు అభిమానులకు ఏదన్నా ఆపద వస్తే వెంటనే సాయం చేయడానికి ముందుకొస్తారు సూర్య. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు అర్జున్ శక్తివేల్ స్వామి. తెలుగు, తమిళం, హిందీలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. సూర్యలాగే కీర్తి సురేశ్ కూడా ఇలాగే తాను నటించిన సినిమా సెట్‌లోని వారికి బంగారు కాయిన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా సెట్ సభ్యులకు బంగారు కాయిన్స్ ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో ఆమె నటించని ‘సందకోళి 2’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక యూనిట్ సభ్యులకు 150 గ్రాములు ఉన్న బంగారు కాయిన్స్‌ను కానుకగా ఇచ్చారు. ఏదన్నా సినిమా తన మనసుకు దగ్గరైంది అనిపిస్తే ఇలా బంగారు నాణేలు ఇస్తుంటానని చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్‌లోని సభ్యులకు ఇలాంటి సర్‌ప్రైజే ఇచ్చారు. షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నప్పుడు కొందరు యూనిట్ సభ్యులకు కొన్ని డాలర్లు ఇచ్చి షాపింగ్ చేసుకోమన్నారట. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి కోసం ఫ్యామిలీ ట్రిప్ టికెట్లు ఉచితంగా ఇచ్చారట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2njEA6u
No comments:
Post a Comment