సినిమాల కోసం ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. దాంతో లండన్‌లో ఉన్న తన భర్త ఆనంద్ అహూజాను చాలా మిస్సవుతున్నారట. ఈ మేరకు సోనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. ‘ఎంతో అందగాడైన నా భర్తను చాలా మిస్సవుతున్నాను. అందగాడే కాదు తెలివైనవాడు, జాలి హృదయం కలిగినవాడు, మొండివాడు కూడా’ అని పేర్కొన్నారు. హీరోయిన్ అవ్వకముందు కూడా ఓ ఆడపిల్లే. పెళ్లయిన ప్రతీ ఆడపిల్ల తన భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇందుకు హీరోయిన్లు అతీతం కాదు. పెళ్లయ్యాక సోనమ్ తన భర్తతోనే కలిసి లండన్‌లోనే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. కేవలం సినిమాల కోసం, తన తల్లిదండ్రులను చూడటం కోసం మాత్రమే సోనమ్ ముంబయి వచ్చి వెళ్తున్నారు. దిల్లీకి చెందిన ఆనంద్ అహూజాకు రూ.3000 కోట్ల విలువైన వ్యాపారాలు ఉన్నాయి. భానే అనే ఫేమస్ ఫ్యాషన్ బ్రాండ్‌కు ఆయన యజమానిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తగా కంటే సోనమ్ కపూర్ భర్తగానే అందరికీ తెలుసు. దాదాపు మూడేళ్ల పాటు సోనమ్ కోసం ఎదురుచూసిన ఆనంద్ మొత్తానికి ఆమో ప్రేమను గెలుచుకున్నారు. అలా ఏడాది పాటు ఆనంద్‌తో డేటింగ్‌లో ఉన్న సోనమ్.. 2018 మేలో ముంబయిలోనే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ లండన్ వెళ్లిపోయారు. ఆనంద్‌కు లండన్‌లో ఖరీదైన ఇల్లు ఉంది. ఇప్పుడు ఇద్దరూ అక్కడే నివసిస్తున్నారు. ఇక సోనమ్ వర్క్ విషయానికొస్తే.. ‘బ్లాక్’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు సోనమ్. ఆ తర్వాత వచ్చిన ‘సావరియా’ సినిమాతో సోనమ్ కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమా సోనమ్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ ప్రయాణం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ‘నీర్జా’ సినిమాతో సోనమ్‌కు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించని ‘జోయా ఫ్యాక్టర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించారు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇప్పటివరకు సోనమ్ మరో సినిమాకు సంతకం చేయలేదు. త్వరలో ఆమె మళ్లీ తన భర్త వద్దకు వెళ్లిపోతారు. తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయడానికే సోనమ్ ఎక్కువగా సినిమాలకు ఒప్పుకోవడంలేదని తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lSWjkz
No comments:
Post a Comment