మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హైప్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ ఆయన ఎన్నాళ్ల నుండో చేయాలనుకుంటున్న పాత్రను సొంత నిర్మాణంలో చేస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రను చిరంజీవి పోషిస్తూ.. ‘సైరా’గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌లతో ఈ అంచనాలు రెట్టింపుకావడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో సినిమాకి ఉన్న హైప్‌ని క్యాష్ చేసుకుంటూ విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే మూవీ మార్కెట్ పీఆర్ ఎక్స్ పర్ట్ ఉమైర్ సంధు ‘సైరా’ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ‘సైరా చిత్రం ఎమోషనల్ రైడ్‌తో అద్భుతంగా ఉంది. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందుతారు. బాహుబలి చిత్రం కల్పన కాని.. ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. ఏపీ అన్ని రికార్డ్‌లను సైరా స్మాష్ చేస్తుంది. మెగాస్టార్ అభిమానులకు ఈ చిత్రం పండగే’ అంటూ నాలుగు ఫైర్ స్టార్‌లు వేసేశాడు. అయితే ఇతను నిజంగానే సినిమాలను చూసి రివ్యూలు ఇస్తాడా? లేక హైప్‌ని దృష్టిలో పెట్టుకుని రివ్యూలు ఇస్తాడో తెలియదు కాని.. హిట్ చిత్రాలతో పాటు కొన్ని అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు సైతం ఐదు స్టార్లు వేసిన ఘనత ఇతనికి ఉంది. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, మహేష్ బాబు ‘స్పైడర్’, అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు ఈయన టాప్ రేటింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా ‘సాహో’ చిత్రానికి సైతం మైండ్ బ్లోయింగ్ అంటూ రివ్యూ ఇచ్చారు. ఈ లెక్కన ఆయన రివ్యూలను నమ్మే పరిస్థితి లేదని చెప్పాలి. ఇతని రివ్యూ సంగతి పక్కనపెడితే.. ‘సైరా’ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో అయితే బలంగానే ఉంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించిన చిరు, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్లు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నిర్మాత రామ్ చరణ్‌తో పాటు మెగా డాటర్స్ కూడా ‘సైరా’ ను ప్రమోట్ చేస్తున్నారు. సుమారు రూ.270 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అమితి త్రివేది సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nEPlQF
No comments:
Post a Comment