ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన యూఎన్ క్లైమెట్ యాక్షన్ సమిట్‌లో 16 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ అనే క్లైమెట్ యాక్టివిస్ట్ తన పవర్‌ఫుల్ స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఎందరో సెలబ్రిటీలు గ్రెటా స్పీచ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘HOW DARE YOU’ అంటూ గ్రెటా ఇచ్చిన స్పీచ్ ఎందరో హృదయాల్ని కలచివేసింది. ఈ అంశంపై గ్లోబల్ స్టార్ చోప్రా కూడా స్పందించారు. ‘ప్రస్తుతం అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని చెప్పి థ్యాంక్యూ గ్రెటా. మాతృభూమిని ఎలా కాపాడుకోవాలో మా తరాలకు వివరించినందుకు ధన్యవాదాలు. చివరికి మనకున్నది ఇదొక్క ప్లానెటే కదా..’ అని ట్వీట్ చేశారు. అయితే మన భారతదేశంలో కూడా ప్రభుత్వాలు, సోషల్ యాక్టివిస్ట్‌లు మాతృభూమిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రియాంక భారతదేశాన్ని కూడా పొగిడి ఉండాల్సింది. ఇదే విషయంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ ప్రస్తావించారు. ‘డియర్ ప్రియాంక చోప్రా మీరు తిరిగి ఇండియాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీరు అన్నట్లు గ్రెటా థన్‌బర్గ్ నిజంగానే చాలా మంచి పని చేస్తోంది. కానీ మన దేశంలో కూడా ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంతో మంది మనసా వాచా కర్మణా కష్టపడుతున్నారు. వారు కేవలం ప్రసంగాలు ఇచ్చి ఊరుకోవడం లేదు మార్పులు కూడా తెస్తున్నారు. వారి గురించి కూడా ప్రస్తావించి అభినందించి ఉంటే బాగుండేది’ అని పేర్కొన్నారు. అందరి విషయాల్లో తలదూర్చి ఏదో ఒక కామెంట్ చేయడం రంగోలీకి అలవాటు. ఆమె తన అభిప్రాయాలను వెల్లడించడంలో ఎంత మాత్రం తప్పు లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ కొన్ని అనవసరమైన విషయాల్లో కూడా రంగోలీ కల్పించుకుని వార్తల్లోకెక్కుతుంటారు. కంగనా రనౌత్‌కు కేవలం ఆమె సోదరి మాత్రమే కాదు మ్యానేజర్ కూడా. ఎన్నో అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించి వివాదాల్లో చిక్కుకున్నారు. తన సోదరికి మూడు సార్లు నేషనల్ అవార్డు వచ్చిందన్న గర్వమో లేక ఇతర నటీమణులపై అసూయో తెలీదు కానీ రంగోలీతో పెట్టుకోవడం కంటే నోరు మూసుకుని కూర్చోవడం మంచిందని చాలా మంది ఆమె మాటలను, ట్వీట్లను పట్టించుకోకుండా ఊరుకుంటుంటారు. ఇప్పుడు రంగోలీ ప్రియాంక చోప్రాకు గురిపెట్టింది కాబట్టి దీనిపై గ్లోబల్ స్టార్ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mc4cls
No comments:
Post a Comment