సైరా...ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో డిస్కషన్ పాయింట్‌గా మారిన సినిమా. ఆ సినిమా రూపుదిద్దుకోవడానికి రెండున్నరేళ్లు పట్టినా కూడా ఆ కథ పుట్టి మాత్రం పదేళ్లు దాటింది. ఇదే విషయాన్ని స్వయంగా తెలియజేసారు పరుచూరి గోపాలకృష్ణ. '2006లో చిరంజీవి గారికి ఈ సినిమా కథ చెప్పాం. ఆ కథ విని అదిరిపోయింది అని దాన్ని డెవలప్ చెయ్యడం కోసం మా అన్నయ్యని దుబాయ్ తీసుకెళ్లారు, బ్యాంకాక్ తీసుకెళ్లారు, ఈ కథ పై కూర్చుంటూనే ఉన్నారు. 2008 వరకు ఈ సినిమా కథపై ఉన్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అప్పుడు చాలా బాధవేసింది' అని సైరా కథ గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. Also Read: 'చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక చాలామంది సైరా కథ ఇవ్వమని అడిగారు కానీ మేము మాత్రం ఈ కథ చిరంజీవి గారికి మాట ఇచ్చాం, ఎప్పటికయినా ఆయనే చెయ్యాలి అని చెప్పాం. ఒకసారి కూడా సైరా కథ ఒక్కసారి చెప్పండి, అన్నయ్య ఆ కథని ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు అని అడిగారు. మధ్యలో చిరంజీవి గారు కూడా ఒక వేళ ఈ కథ నేను చెయ్యలేకపోతే రామ్ చరణ్‌కి సూట్ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి అన్నారు. కానీ మేము మాత్రం ఈ కథ చేస్తే మీరే చెయ్యాలి అని చెప్పాం. చిరంజీవి సినిమాల్లోకి తిరిగొచ్చాక మళ్ళీ ఈ సినిమా గురించి డిస్కషన్ వచ్చింది. కానీ అప్పుడు మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఖైదీ నెంబర్ 150 చేసారు' అంటూ సైరా కథ వెనుక జరిగిన మొత్తం కథని వివరించారు ఈ డైనమిక్ రైటర్. ఖైదీ నెంబర్ 150 విజయం తరువాత, రాజమౌళి బాహుబలి తీసాక ఈ సినిమాని ఇంత హై బడ్జెట్‌తో తెరకెక్కించారట. Also Read: ఏ సినిమా ఆడియో ఫంక్టన్‌కి అయినా,ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా పరుచూరి గోపాలకృష్ణ వస్తే ఆ సినిమా హీరో అభిమానులను ఉర్రుతలూగించేలా మాట్లాడతారు.అయితే సైరా కథ పుట్టుకలో కీలక పాత్ర పోషించిన ఆయన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం ఒక వింతయిన విషయం. ఆ లోటు ఆ వేదిక దగ్గర క్లియర్‌గా కనిపించింది. అయితే దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 'సైరా ఫంక్షన్‌కి నేను రాకపోవడం గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. కానీ ఆ టైమ్‌లో నా ఆరోగ్యం బాలేదు. సైరా ఈవెంట్ టైమ్‌లో మూడు రోజులు వెనుక నరం పట్టెయ్యడంతో అడుగుతీసి అడుగువెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను' అంటూ ఆ వేడుకకు ఆయన రాకపోవడానికి కారణాన్ని వివరించారు. Also Read: ఏది ఏమైనా ఒక హీరో కోసం 13 సంవత్సరాలపాటు ఒక కథని హోల్డ్ చెయ్యడం అనేది మామూలు విషయం కాదు. ఆ కథని కోటి కాదు అంతకంటే ఎక్కువే అడిగినా కూడా ఇచ్చి ఎవరో ఒకరు కొనుక్కునేవారు. కానీ పరుచూరి బ్రదర్స్ అంత డబ్బును కూడా ఒక్క మాట కోసం వదులుకున్నారు. అందుకే వాళ్ళ కలను నెరేవేరుస్తూ సైరా భారీ క్రేజ్‌తో అక్టోబర్ 2న బ్రహ్మాండమయిన విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా బాహుబలి రికార్డ్‌ని కూడా దాటుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి అనేది వచ్చే బుధవారం తేలుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ocHR7S
No comments:
Post a Comment