బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి.. బార్బీ డాల్ కత్రినా కైఫ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా కత్రినాకు సల్మాన్ పిల్లర్‌లా నిలిచాడు. అవకాశాలు లేకపోతే తన సినిమాల్లోనే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. కత్రినా విషయం తెలీదు కానీ.. మాత్రం ఆమెను చాలా ప్రేమించాడు. కానీ పాపం ఆయన ప్రేమ ఫలించలేదు. సల్మాన్ కంటే రణ్‌బీర్ కపూర్ బెటర్ అనుకున్న కత్రినా అతనితో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండటానికి నిర్ణయించుకుంది. సరే.. జరిగిందేదో జరిగిపోయింది. ప్రేమ ఫలించకపోయినప్పటికీ సల్మాన్, కత్రినా ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్‌లా ఉంటున్నారు. చూడబోతే సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నట్లున్నారు. ఏ హీరోయిన్‌ని చూసినా పొరపాటున కత్రినా అని పిలిచేస్తున్నారు. ఆదివారం సల్మాన్ తాను ఎప్పటినుంచో హోస్ట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ 13 సీజన్‌ను ప్రారంభించారు. ఈ షోలో బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా పాల్గొన్నారు. అయితే ఆమెను పొరపాటున ‘క్యాట్’ (కత్రినా ముద్దు పేరు) అని పిలిచేశారు. దాంతో అక్కడున్నవారంతా ఓ..ఓ.. అంటూ కేకలు వేశారు. ఆ తర్వాత తన మిస్టేక్ తెలుసుకున్న సల్మాన్ కోయినా అని పిలవడం మొదలుపెట్టారు. దీనిని బట్టే అర్థమవుతోంది సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నారని. అంతేకాదు.. ఓసారి ఓ మీడియా ఛానెల్ సల్మాన్‌ను ప్రశ్నిస్తూ.. ‘మీరు కలిసి పనిచేసిన హీరోయిన్ల గురించి మూడు ముక్కల్లో చెప్పండి’ అని అడిగారు. ఇందుక సల్మాన్.. కరీనా కపూర్ గురించి, ఐశ్వర్య రాయ్ గురించి ఇంకా చాలా మంది గురించి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. కానీ కత్రినా కైఫ్ గురించి మత్రం దాదాపు మూడు నిమిషాల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ సల్మాన్‌కు కత్రినాపై అంతే ప్రేముంది. కత్రినాను సల్మాన్ కాకుండా మరెవ్వరూ అంత ప్రేమగా చూసుకోలేరేమో. ఏదైతేనేం.. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. మున్ముందూ మరిన్ని సినిమాలు రావాలని అభిమానులూ కోరుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mY45Kx
No comments:
Post a Comment