మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా విడుదలవుతోంది. పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి యూనిట్ ఇంకా సరైన ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. బాలీవుడ్‌లో క్రేజ్ కోసం ఆ మధ్య ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ప్రమోషన్స్ కిక్‌స్టార్ట్ చేయలేదు. Also Read: నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను రెండింతలు చేయాలని ‘సైరా’ టీం చూస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 15న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ఈ వేడుకకు సంబంధించి భారీ మార్పులు జరిగినట్టు ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఆయన స్వస్థలమైన కర్నూలులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15న ఈ వేడుక జరపాలని అనుకున్నారు. కానీ, వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో వేదికను మార్చాలని ‘సైరా’ టీం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించారట. సెప్టెంబర్ 18న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, ‘సైరా’ సినిమా విడుదల తేదీ కూడా మారుతుందని, చిత్రం వాయిదా పడుతుందని ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే, విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం కచ్చితంగా విడుదలవుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. #SyeRaaOnOct2nd హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q4hO0p
No comments:
Post a Comment