
ప్రముఖ హాస్యనటుడు ఆరోగ్య పరస్థితి చాలా విషమంగా ఉందని, ఆయనకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారని మంగళవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సన్నిహితులు ద్వారా తెలిసింది. అయితే, ఆ వార్త బయటికొచ్చిన వెంటనే వేణుమాధవ్ చనిపోయారంటూ మరోవార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. చాలా మంది ‘రిప్ వేణుమాధవ్’ అంటూ ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్‌లు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, వేణుమాధవ్ చనిపోయారంటూ వచ్చిన రూమర్‌పై ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణుమాధవ్ బతికే ఉన్నారని, ట్రీట్‌మెంట్‌కు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. తాను హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడనని వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయనొక వీడియో మేసేజ్ పెట్టారు. ‘‘వేణుమాధవ్ అన్నయ్యను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిని నేను. ఆయనలా మిమిక్రీ చేయాలని ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటి వ్యక్తి చనిపోయారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఇక మన మధ్యలేరని ఏవేవో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో, వివిధ టీవీ ఛానళ్లలో ఈ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. ఆయన ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారు. కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను హాస్పటిల్‌లోనే ఉన్నాను. డాక్టర్‌తో మాట్లాడాను. వేణుమాధవ్ గారి తల్లి అయితే ఇదేంటి నాన్న వాళ్లంతా చనిపోయారని వేసేస్తున్నారు.. దయచేసి మీడియాకు చెప్పు అంటే నేను ఈ వీడియో పెడుతున్నాను. చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తిని త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి తప్ప.. రిప్ అని, ఇకలేరని దయచేసి పోస్టులు పెట్టకండి’’ అని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2l1RmFU
No comments:
Post a Comment