
ముస్కాన్.. నేపాల్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక. చదువులో ఎప్పుడూ క్లాస్ ఫస్టే. అభంశుభం తెలీని ఆ బాలికపై యాసిడ్ ఎటాక్ జరిగింది. చేసింది ఎవరో కాదు.. ఆ బాలికతో పాటు స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు. కారణం ఏంటె తెలుసా? ముస్కాన్ ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్ వస్తోందన్న కోపం, అసూయ. ఫలితంగా.. ఆ చిన్నారి కుడి వైపు ముఖం అంతా కాలిపోయింది. అదృష్టం బాగుండి కళ్లకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. సగం కాలిన తన ముఖాన్ని చూసుకోలేక జీవితంపై ఆశలు వదులుకుంది. చనిపోతానంటూ గుండెలవిసేలా ఏడ్చింది. కానీ ఆ బాలికలో ధైర్యాన్ని నింపారు బాలీవుడ్ నటులు , కృతి సనన్. ముస్కాన్‌కు వరుణ్ ధావన్, కృతి సనన్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం వరుణ్ ధావన్, కృతి సనన్‌కి తెలిసింది. దాంతో వెంటనే కృతి సనన్ ముస్కాన్‌తో మాట్లాడాలని వీడియో కాల్ చేసింది. కృతి సనన్‌ని చూడగానే ముస్కాన్ ఎంతో సంతోషపడింది. ముస్కాన్ గురించి కృతి సనన్ వరుణ్ ధావన్‌కు చెప్పింది. దాంతో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కృతి సనన్ నాకు ముస్కాన్ గురించి చెప్పింది. నేను ముస్కాన్‌ని కలవాలనుకుంటున్నాను. ఈ చిన్నారి గురించి నాకు చెప్పినందుకు థ్యాంక్యూ కృతి సనన్’ అని పేర్కొన్నారు. బాలిక కోసం వరుణ్ ఓ వీడియోను రికార్డ్ చేసి పంపారు. ధైర్యాన్ని కోల్పోకూడదని, బతికి సాధించాలని చెప్పారు. తనపై దాడి చేసిన వారికి మళ్లీ చదువులో ఉన్నతంగా రాణించి పగ తీర్చుకోవాలని కోరారు. త్వరలో కలవడానికి నేపాల్ రాబోతున్నానని వరుణ్ ముస్కాన్‌కు చెప్పారు. తనకిష్టమైన స్టార్స్ తనతో ఫ్రెండ్లీగా మాట్లాడేసరికి ముస్కాన్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇప్పుడు తనలో బతకాలన్న ఆశ కలిగింది. చాలా రోజులుగా ఏడుస్తూ ఉన్న ఆ బాలిక ముఖంలో ఎట్టకేలకు చిరునవ్వు వచ్చింది. ముస్కాన్ గురించి తెలుసుకోగానే వెంటనే స్పందించిన వరుణ్ ధావన్, కృతి సనన్ నిజంగానే సూపర్‌స్టార్స్. వీరి ప్రోత్సాహంతో ముస్కాన్ పూర్తిగా కోలుకుని మళ్లీ స్కూల్‌కి వెళ్లి ఎప్పటిలాగే ఫస్ట్ ర్యాంకర్‌గా నిలవాలని మనమూ ఆశిద్దాం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2noQuvX
No comments:
Post a Comment