‘శకుంతాల దేవి- హ్యూమన్ కంప్యూటర్’ బయోపిక్ టీజర్ విడుదలైంది. బాలీవుడ్ నటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న ప్రముక గణితవేత్త శకుంతలా దేవి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. టీజర్‌లో శకుంతలా దేవిలా విద్య లుక్ ఆకట్టుకుంటోంది. పొట్టి జట్టు, ఎరుపు రంగు చీరలో విద్య చాలా అందంగా కనిపిస్తున్నారు. సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. అను మేనన్ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. విద్యా కెరీర్‌లో ఇది నాలుగో బయోపిక్ అని చెప్పొచ్చు. గతంలో ఆమె ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలో అలనాటి తార సిల్క్ స్మిత పాత్రలో నటించారు. ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన ‘మిషన్ మంగళ్’ చిత్రంలో ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ తారా షిండే పాత్రను పోషించారు. ఇక శకుంతలా దేవి బయోపిక్ విషయానికొస్తే.. కర్ణాటకలో జన్మించిన శకుంతల ఎంతటి కష్టమైన సంఖ్యలపైనా మునివేళ్లలపై లెక్కించేసేవారు. ఆమెని అందరూ హ్యూమర్ కంప్యూటర్, మెంటల్ క్యాల్కులేటర్ అని పిలుస్తారు. ఆమెకున్న టాలెంట్‌తో 1982లో గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. గణితవేత్తగానే కాకుండా రచయిత్రిగానూ శకుంతల ఎంతో ఫేమస్. ఆమె రాసిన ‘ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్’ అనే పుస్తకం భారత దేశంలో స్వలింగ సంపర్కంపై రాసి మొదటి బుక్‌గా పేరొందింది. అలా తనకు గణితంపై ఉన్న నాలెడ్జ్‌తో ఎన్నో విదేశాలను చుట్టి వచ్చారు. 2013 ఏప్రిల్‌లో గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/304cTks
No comments:
Post a Comment