తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‌కు ‘క్వీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ‘అమ్మ’ పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇటీవల ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ నేపథ్యంలో జయలలిత అన్న కొడుకు దీపక్.. గౌతమ్ మేనన్‌ను బెదిరిస్తున్నారట. జీవితాధారంగా సినిమా చేసేందుకు ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ అనుమతి తీసుకున్నారని, కానీ ‘క్వీన్’ సిరీస్‌ను తెరకెక్కిస్తున్న గౌతమ్ మేనన్ టీం మాత్రం ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దాంతో దీపిక్ ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే గౌతమ్ మేనన్ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. ‘క్వీ్న్’ జయలలిత బయోపిక్ కాదని, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీస్తున్న సిరీస్ అని క్లారిటీ ఇచ్చారు. అలాంటప్పుడు జయ లలిత కుటుంబం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రను ఇద్దరు నటీమణులు పోషిస్తున్నారు. యంగ్ జయలలితగా అనిఖా సురేంద్రన్ కనిపిస్తారు. రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత పాత్రను రమ్యకృష్ణ పోషించారు. ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళుల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ నటించినట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎక్స్ ప్లేయర్ సౌజన్యంతో నిర్మించారు. త్వరలోనే ఈ బయో వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తేనున్నారు.మరి ఎవరి సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో ఇంకొంత కాలం వేచి చూడాలి. ఇప్పటికే జయలలితపై ఎంతో మంది బయోపిక్‌లు తీస్తున్నారు. ఏ.ఎల్ విజయ్ తమిళం, హిందీలో ‘తలైవి’ టైటిల్‌లో బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకు గానూ కంగన ఏకంగా రూ.24 కోట్ల పారితోషికం తీసుకున్నారట. మరోపక్క ప్రియదర్శిని అనే తమిళ దర్శకురాలు కూడా జయ లలితపై ఓ బయోపిక్ తీస్తున్నారు. ఇందులో నిత్యా మేనన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. సినిమాకు ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I6NATR
No comments:
Post a Comment