ఓ హిందీ సినిమాలో స్థానంలో తమన్నాను ఎంపిక చేసుకున్నారని వస్తున్న వార్తలపై మండిపడ్డారు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా. ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముంబయి సాగా’. అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తు్న్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ సినిమా నుంచి తప్పుకొన్నారని ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసుకున్నారని ఓ ఆంగ్ల మీడియా వర్గం వార్త రాసింది. దీనిపై బాగా ప్రచారం చేసింది. ఇది కాస్తా దర్శకుడు సంజయ్ గుప్తా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘అసలు ఈ మీడియా వర్గాలకు ఏమైంది? ఇంత దారుణంగా కల్పిత వార్తలు ఎలా రాసేస్తారు? ముంబయి సాగా షూటింగ్‌కు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను మేం ఇటీవల పూర్తి చేశాం. కాజల్ అగర్వాల్ చాలా బ్రిలియంట్‌గా నటించారు. కాబట్టి ఇలాంటి ఫేక్ స్టోరీస్ నుంచి దూరంగా ఉండండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1980ల కాలం నేపథ్యంలో ముంబయి సాగా సినిమాను తెరకెక్కిస్తున్నారు సంజయ్. ఇందులో కాజల్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో ఉండబోతోందని చాలా వినోదాత్మకంగా ఉంటుందని వెల్లడించారు. కాజల్ బ్రిలియంట్ పెర్ఫార్మర్ అని కొనియాడారు. మరోపక్క కాజల్ చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘క్వీన్’ సినిమా తమిళ రీమేక్‌లో కాజల్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘పారిస్ పారిస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను నాలుగు భాషల్లో రీమేక్ చేస్తు్న్నారు. తెలుగులో ‘దీటజ్ మహాలక్ష్మి’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా నటిస్తున్నారు. మరోపక్క విలక్షణ నటుుడ కమల్ హాసన్‌కు జోడీగా కాజల్ ‘భారతీయుడు 2’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు, ఈ సినిమాకు సంబంధించి కూడా కాజల్‌పై ఎన్నో వదంతులు వచ్చాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం వల్ల కాజల్ తప్పుకొన్నారని అప్పట్లో వదంతులు వినిపించాయి. దీనిపై కాజల్ స్పందిస్తూ... అందులో ఏమాత్రం నిజం లేదని, ఏం జరిగినా తాను సినిమా నుంచి తప్పుకొనే పరిస్థితే లేదని వెల్లడించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LqERhp
No comments:
Post a Comment