Rajasekhar: పెళ్లికి ముందు ఒకే గదిలో.. మా ఆయనకు వేరే పెళ్లి!: జీవిత రాజశేఖర్

జీవితా రాజశేఖర్.. పేరులోనే కాదు.. నిజ జీవితంలోనూ పక్కన ఉండాలి. జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత అన్నంతగా టాలీవుడ్‌లో ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి వైవాహిక జీవితంలో చాలా ఆసక్తికరపరిణామాలు చోటుచేసుకున్నాయి. సినిమా కథను తలపిస్తూ సాగిన వీరి రిలేషన్, ప్రేమ, పెళ్లిలో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి. అప్పట్లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత.. తన భర్త రాజశేఖర్‌తో అనుబంధం.. ప్రేమ.. పెళ్లిపై ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అవేంటో ఆమె మాటల్లోనే.... హీరో కాబట్టి అమ్మాయిలతో సన్నిహితంగా.. నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు.. ఆయన విషయంలో నేను ఎప్పుడు కరెక్ట్‌గా ఉండేదాన్ని. ముఖ్యంగా నేను చాలా స్ట్రాంగ్ అని నన్ను నేను నమ్ముతా. అందుకే ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోతుందని ఎప్పుడూ అనిపించలేదు. నేను కరెక్ట్‌గా ఉంటే నా నుండి ఎవరూ వెళ్లిపోలేరు. నా పిల్లలు కానివ్వండి నా భర్త కానివ్వండి.. ఫ్రెండ్స్ అయినా.. వాళ్లకు నేను ఒక అవకాశం ఇవ్వనంత వరకూ నన్ను విడిచి ఎలా వెళ్తారు? ఎక్కడైనా ఏ రిలేషన్ షిప్‌లోనైనా తేడా వచ్చింది అంటే.. అవకాశం కల్పించడం వల్లే. మనం ఒకరితో ఒకరు అండర్‌స్టాండింగ్‌గా కాంప్రమైజింగ్‌గా వెళ్లిపోతే గొడవలే ఉండవు. గొడవలు రానంతవరకూ వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోతారనే భయం కూడా ఉండదు. నేను ఇప్పటి వరకూ ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యా.. సక్సెఫుల్‌గానే ఉన్నా. అమ్మాయిలు పిలిచినా నాతో చెప్పేవారు.. రాజశేఖర్ గారితో నాకు బాగా నచ్చేది ఏంటంటే.. ఏది జరిగినా నాతో షేర్ చేసుకుంటారు. అమ్మాయిలు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఎవరున్నా నాతో చెప్పకుండా ఏదీ చేసేవారు కాదు. ఒకవేళ ఒక అమ్మాయి ఫోన్ చేసి నా దగ్గరకు రండి అని అన్నాకూడా ఆయన నాతో చెప్తారు. నిజ జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఒకరోజు ఆయన ఒంగోలులో షూటింగ్‌లో ఉన్నారు. అప్పటికి మాకు పెళ్లి కూడా కాలేదు. మేం ఇద్దరం ఎప్పుడూ అనుకునే వాళ్లం.. ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. కాని పెళ్లికి అందరూ ఒప్పుకోవాలి అనుకున్నాం. ఎవర్ని నొప్పించి పెళ్లి చేసుకోకూడదు అని డిసైట్ అయ్యాం. కాని మేం చాలా బోల్డ్ గానే లిఫ్ట్ చేశాం. మా పెళ్లికి ముందు ‘నవభారతం’ సినిమా టైంలో నటించే టైంలో ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్లం. పక్క పక్క గదులు ఉన్నా సరే మేం.. ఒకే గదిలో ఉండేవాళ్లం. ఇండస్ట్రీలో మాపై అప్పట్లో పెద్ద టాక్.. ఇలా మేం ఇద్దరం కలిసి ఉండటం వల్ల.. ఇండస్ట్రీలో మాపై చాలా చర్చలు జరిగేవి. అయితే పెళ్లి అవుతుందా లేదా? ఇద్దరం పెళ్లి చేసుకోకపోతే నవ్వులపాలైపోతాం అని ఎప్పుడూ అనుకోలేదు. మా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా బాధపడేవాళ్లు. రాజశేఖర్ ఇంటర్వ్యూలలో మా అమ్మ ఎవరు చెప్తే వాళ్లను చేసుకుంటా అని చెబుతున్నాడు.. నువ్వేమో రాజశేఖర్‌తో తిరుగుతున్నావ్ అని మా పేరెంట్స్ బాధపడేవాళ్లు. నేను వాళ్లతో నా నిర్ణయాన్ని చెప్పేశా. రాజశేఖర్ నాకు అంతా ముందే చెప్పారు. నేను ఇంతే.. తను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఇలాగే ఉంటా. మా రిలేషన్ షిప్ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ ఆయన జీవితంలోకి వేరే అమ్మాయి వచ్చి తను యాక్సెప్ట్ చేయకపోతే మేం గుడ్ ఫ్రెండ్స్‌గా ఉండిపోతాం. అది ఆయన ఇష్టం ఆవిడకు ఏం చెప్తారన్నది ఆయన నిర్ణయం. ఇద్దరం ఇలాగే డిసైడ్ అయ్యాం. ఆయనకే వేరే అమ్మాయితో పెళ్లి దాదాపు ఖాయమైంది.. కాని అనుకున్నట్టుగానే రాజశేఖర్ గారికి వేరే అమ్మాయితో పెళ్లి దాదాపు ఖాయమైంది. రెండు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఆమె కాని హీరోయిన్ కాదు.. పేరు చెప్పను కాని పెళ్లి మాత్రం ఆవిడతో సెట్ అయ్యింది. అంతా ఓకే అనుకున్నారు.. రాజశేఖర్ పూర్తి సంతోషంతో లేరు కాని వాళ్ల ఫ్యామిలీ నిర్ణయాన్ని కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నారు. వాళ్ల బ్రదర్ ఇన్ లా వచ్చి నాతో మాట్లాడారు. నేకు పెయిన్‌గా ఉన్నా.. రాజశేఖర్ పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ అమ్మాయి నా సీనియర్.. రాజశేఖర్‌తో పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి నాతోనే చదువుకుంది. ఆమె నా సీనియర్. ఆమె పేరు చెప్పకూడదు. అయితే ఒకరోజు ఆమె నన్ను కలవాలంటుందని నాతో చెప్పారు. ముగ్గురం కలిసి ఓ గుడికి వెళ్లాం. ఎప్పుడూ నేను ఆయన కారులో ఆయన పక్కన కూర్చునే దాన్ని. ఆరోజు నేను వెనుక కూర్చున్నా. ఆ అమ్మాయి ఆయన పక్కన కూర్చుంది. ఇద్దరం బాగానే మాట్లాడుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళిపోయాం. ఆ తరువాత ఈ ఆలోచనలతో నాకు హెల్త్ పాడైంది. ఆ తరవాత రాజశేఖర్‌తో వరుస సినిమాలు చేసేవాళ్లం. ఆమె పెట్టిక కండిషన్‌కి రాజశేఖర్ ఒప్పుకోలేదు.. తరువాత ఏమైందో ఏమో కాని.. ఆమెకు రాజశేఖర్‌తో నా రిలేషన్ నచ్చలేదు. ఒకరోజు రాజశేఖర్ గారితో జీవితతో రిలేషన్ వదిలేసి.. ఆమెతో సినిమాలు చేయకుండా ఉంటే పెళ్లి చేసుకుందాం అనే కండిషన్ పెట్టింది ఆ అమ్మాయి. వాళ్ల పేరెంట్స్ కూడా అదే అభిప్రాయం చెప్పారు. అప్పుడు రాజశేఖర్ గారు.. అది ఇంపాజిబుల్. నా లైఫ్‌ని మీరు డిక్టేట్ చేయొద్దు. ఒక భార్యగా నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇస్తా.. కాని జీవిత మాట్లాడొద్దు అనడం కరెక్ట్ కాదని ఆయన చెప్పేశారు. నేను చేసింది రైటా రాంగా అని రాజశేఖర్ గారు నన్ను అడిగారు. దానికి ఆన్సర్ చెప్పే సరిస్థితుల్లో నేను లేన్నా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పా. ఆ తరువాత చాలా జరిగింది. పెళ్లి క్యాన్సిల్ చేసి ఆమెను అమెరికాకు పంపేశారు. వాస్తవానికి ఆమె రాజశేఖర్‌ని చాలా ఇష్టపడి హై లెవల్‌లో మ్యారేజ్‌ కోసం ప్లాన్ చేశారు కాని కుదర్లేదు. మా ప్రేమకథ మలుపు తిరిగింది ఇక్కడే.. పెళ్లి క్యాన్సిల్ అయిన తరువాత రాజశేఖర్‌తో కలిసి రెండు మూడు ఫిల్మ్స్‌లో నటించా. అయితే మగాడు మూవీ టైంలో ఆయనకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. నెలన్నర పాటు ఆయన హాస్పటల్‌లోనే ఉన్నారు. ఆయనతో పాటు నేను హాస్పటల్‌లోనే ఉన్నా. ఆ తరువాత వాళ్ల పేరెంట్స్ మనసు మార్చుకుని డైరెక్ట్‌గా హాస్పటల్‌ను వాళ్ల ఇంటికే తీసుకువెళ్లారు. వెంటనే పెళ్లి చేద్దాం అనుకున్నారు. కాని ఆయన కోలుకోవడానికి ఏడాది పట్టింది. అప్పుడు నేను ఆయన ఇంట్లోనే ఉన్నాం. ఆయన కోలుకున్న తరువాత పెళ్లి అనుకునే లోపు మా నాన్న గారు చనిపోవడంతో ఏడాది ఆగి ఆ తరువాత పెళ్లి చేసుకున్నాం’ అంటూ సినిమా కథను తలపించే ‘జీవిత-రాజశేఖర్’ ప్రేమకథను చెప్పుకొచ్చారు జీవిత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2J5JECE

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts