ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు, నిర్మాత మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నానక్‌రామ్ గూడలోని ఆమె నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZRg0YC
No comments:
Post a Comment