‘ఓ బేబీ’లాంటి కథలు ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలని అన్నారు విక్టరీ వెంకటేశ్. కీలకపాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేశ్, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జులై 5న ‘ఓ బేబీ’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. సినిమా మామూలుగా లేదు. సమంత సినీ జీవితంలోనే ఇది అత్యుత్తమ చిత్రం అనుకోవచ్చు. ఇలాంటి కథను ఎంచుకుని సినిమాగా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నందినీరెడ్డిని అభినందిస్తున్నా. బేబీ పాత్రలో సమంత అదరగొట్టేసింది. తెలుగులో ఇప్పటివరకు రాని కథ ఇది. నటీనటులంతా చాలా బాగా చేశారు’ అని మెచ్చుకున్నారు. రానా మాట్లాడుతూ.. తెలుగులో కొత్త తరహా సినిమాలు రావాలని కోరుకునే వాళ్లలో నేనూ ఉంటా. బేబీ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇలాంటి సినిమాలు ప్రతి వారం రావాలి. బేబీగా సమంత నటన సూపర్బ్’ అని అన్నారు. సమంతకూ, లక్ష్మికీ నేనే బోయ్‌ఫ్రెండ్‌ని: రాజేంద్రప్రసాద్ ‘‘ఓ బేబీ’లో నటిస్తుంటే హాలీవుడ్ సినిమాలో నటించిన ఫీలింగ్ కలిగింది. మంచి పాత్రలు ఎంపిక చేసుకోవడం వల్లే ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగగలిగా. ‘అహనా పెళ్లంట’ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నటించే అవకాశం వచ్చింది. గతంలో నేనే నటించిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే ‘ఓ బేబీ’లో పాత్ర మరో ఎత్తు. ఈ సినిమాలో లక్షీకి, సమంతకు నేనే బాయ్‌ఫ్రెండ్‌ని’
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YkJvl2
No comments:
Post a Comment