సినీ పరిశ్రమలో నటీనటులు దంపతులుగా మారడం సాధారణమే. పాతకాలం నుంచి నేటి కాలం వరకు ఎందరో నటీనటులు జీవిత భాగస్వాములుగా మారడం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే ఇక్కడా ఎన్నో జంటలు మనకు కనిపిస్తుంటాయి. వారిలో కృష్ణ-విజయ నిర్మల జంట మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇద్దరూ ప్రముఖ నటులే కావడం, ఎన్నో సినిమాల్లో జంటగా నటించడంతో అప్పట్లోనే వీరి వివాహం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీ కట్టిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. Also Read: 1966లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరుసటి ఏడాదే ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో జోడీ కట్టారు. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడి అది వివాహ బంధంగా బలపడింది. అయితే కృష్ణ-విజయనిర్మల వివాహం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ప్రముఖ చిత్రకారుడు బాపు 1967లో ‘సాక్షి’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఇందులో కృష్ణ-విజయనిర్మల హీరోహీరోయిన్లు. ఈ సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్ చేశారు. ఆ గ్రామంలోని ఆలయంలో కృష్ణుడికి మీసాలు ఉండటం ప్రత్యేకత. ఈ సినిమాలో నటించిన ప్రముఖ హాస్యనటుడు రాజబాబు ఆ జిల్లాకు చెందినవాడే కాబట్టి ఆ కృష్ణుడి మహత్యం ఆయనకు బాగా తెలుసు. సినిమా షూటింగ్‌లో భాగంగా తెరకెక్కించిన పాట సందర్భంలో కొత్త దంపతుల గెటప్‌లో ఉన్న కృష్ణ-విజయనిర్మలను చూసి ఆయన ‘ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్’ అంటూ జోక్ చేశారు. Also Read: రెండేళ్ల తర్వాత తిరుపతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కృష్ణ- విజయనిర్మల ఇద్దరికీ ఇది రెండో వివాహం. విజయనిర్మలకు మొదటిభర్తతో కలిగిన సంతానం నరేష్. గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xighHy
No comments:
Post a Comment