సీనియర్ నటి, దిగ్గజ దర్శకురాలు (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరవాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు.. విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Also Read: ప్రముఖు నటుడు కూడా విజయనిర్మల మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రితో విజయనిర్మల చేసిన చిత్రాలను ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. Also Read: ‘నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మల గారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల గారు ఒకరు. నాన్నగారి "పాండురంగ మహత్యం" సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. బాల నటి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో "మారిన మనిషి, పెత్తందార్లు, నిండుదంపతులు, విచిత్ర కుటుంబం" సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని బాలయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IQFkbh
No comments:
Post a Comment