‘గీతాగోవిందం’ సూపర్‌హిట్ తర్వాత , రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు భరత్ కమ్మకు ఇదే తొలిచిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈ సినిమా నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటోంది. జులై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలను యూట్యూబ్ ద్వారా యూనిట్ విడుదల చేసింది. వీటిలో ‘కడలల్లే వేచె కనులే’, ‘గిర గిర గిర’, పాటలు యూత్‌ను ఊపేస్తున్నాయి. అయితే సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు పక్కా యూత్ సాంగ్‌ను సిద్ధం చేశారు మ్యూజిక్ డైరెక్టర్. దీనికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెను..’ అంటూ సాగే పల్లవిని నాలుగు భాషల్లో యూనిట్ సభ్యులతో పాడించారు. ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్‌ను రెడీ చేస్తుండగా యూనిట్ సభ్యులు వచ్చి ఏం సాంగ్ చేస్తున్నారు సార్ అని అడుగుతారు. దానికి ఆయన మరో మెలోడీ చేస్తున్నా అని సమాధానం ఇస్తారు. ఇప్పటికి కంపోజ్ చేసిన పాటలన్నీ మెలోడీయే అని.. మళ్లీ మెలోడీయే చేస్తే ఎవరు చూస్తారని వారు అసహనం వ్యక్తం చేస్తారు. అదే సమయంలో ఆ రూమ్‌లోకి వచ్చిన విజయ దేవరకొండకు ఈ విషయం చెప్పినా ఆయన లైట్ తీసుకుని ఫోన్ వస్తే మాట్లాడేందుకు బయటకు వెళ్లిపోతారు. అయితే యూనిట్ సభ్యులంతా ఒత్తిడి చేయడంతో మ్యూజిక్ డైరెక్టర్ కాలేజీ నేపథ్యంలో ఓ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేస్తారు. ఈ పాట పల్లవిని కన్నడలో రష్మిక పాడగా.. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఒక్కొక్కరు పాడారు. అదే సమయంలో ‘ఈ సాంగ్‌లో నేను లేనుగా.. ఇక్కడెందుకు కూర్చున్నాను’ అనుకుంటూ రష్మిక బిత్తర చూపులు చేస్తూ ఉండటం ఫన్నీగా ఉంది. చివర్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సింగిల్ టేక్‌లో కొట్టినం... మజా వస్తది’ అంటూ వారితో కలిసి సందడి చేశారు. ఆ మేకింగ్ వీడియో మీరూ చూసేయండి..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X5PI2R
No comments:
Post a Comment