సాధారణంగా వయసు పెరిగేకొద్దీ అందం తరిగిపోతుంది. కానీ, సినీ తారల విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. వాళ్లకు వయసు పెరుగుతన్నకొద్దీ అందం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందం మీద వాళ్లు పెట్టే శ్రద్ధ అలా ఉంటుంది మరి. హేమమాలిని, రేఖ, కాజోల్, మాధురి దీక్షిత్, , టబు, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వీళ్లంతా ఈ కోవకు చెందినవాళ్లే. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలకు దూరంగా ఉన్న కొంత మంది మాజీ హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా వీరు అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇదిలా ఉంటే, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మంగళవారం (జూన్ 25న) తన 45వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పుట్టినరోజును ఆమె లండన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. చెల్లెలు కరీనా కపూర్, తల్లి బబితా కపూర్ ఇతర కుటుంబ సభ్యులతో ఆమె లండన్‌లో పార్టీ చేసుకున్నారు. అక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న హాట్ ఫొటోను తాజాగా కరిష్మా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘ఏ వయస్సులో ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. బికినీలో పూల్ దగ్గర రొమాంటిక్ భంగిమలో ఉన్న ఈ ఫొటొలో కరిష్మా పిచ్చ హాట్‌గా ఉన్నారు. 45 ఏళ్ల వయసులోనూ తన అందంతో మతిపోగొడుతున్నారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ కపూర్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ తదితరులు సైతం కామెంట్లు పెట్టారు. చాలా హాట్‌గా ఉన్నావంటూ కితాబిచ్చారు. కాగా, కరిష్మా కపూర్ 17 ఏళ్ల వయసులోనే నటన మొదలుపెట్టారు. చదువుకు టాటా చెప్పి సినిమాల్లోకి వచ్చేశారు. 1991లో వచ్చిన ‘ప్రేమ్ ఖైదీ’ సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేశారు. ఆ తరవాత ‘పోలీస్ ఆఫీసర్’, ‘జాగృతి’, ‘నిశ్చయి’, ‘సాప్నే సజన్ కే’, ‘దీదర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేశారు. దీంతో కరిష్మా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమిర్ ఖాన్‌తో కలిసి చేసిన ‘రాజా హిందుస్థానీ’ చిత్రం కరిష్మాను టాప్ హీరోయిన్‌ను చేసేసింది. షారుఖ్ ఖాన్‌తో ‘దిల్ తో పాగల్ హై’, గోవిందతో ‘హీరో నం.1’, సల్మాన్ ఖాన్‌తో ‘బివి నం.1’ వంటి హిట్ చిత్రాల్లో కరిష్మా నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Yj9rx
No comments:
Post a Comment