సినిమా సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోన్న నటుడు శ్రీవిష్ణు. తన స్నేహితుడు నారా రోహిత్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిష్ణు తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందిస్తున్నారు. కిందటేడాది ‘నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఈ ఏడాది కూడా ఓ వైవిధ్యమైన చిత్రంతో తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము - చిత్రమే చలనము’ అనేది ఉప శీర్షిక. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ కుమార్ మన్యం నిర్మించారు. సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పుడు కొత్తగా ఉందే అన్నారంతా. ఇక పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రచార కార్యక్రమాలతో సినిమాను బాగానే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను పిలిచి సినిమా స్థాయిని పెంచారు. హీరో నాని కూడా సినిమా హిలేరియస్‌గా ఉందంటూ కితాబిచ్చారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో తొలి ప్రీమియర్ షో పడిపోయింది. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ అద్భుతంగా చేశారట. తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారని అంటున్నారు. కథనం కాస్త నెమ్మదిగా ఉన్నా మొత్తంగా సినిమా మాత్రం బాగుందని టాక్. కొంత మంది అయితే ఇప్పటి వరకు థియేటర్‌లో ఇంతలా తాము నవ్వలేదని ట్వీట్లు చేస్తున్నారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, మిస్ కావొద్దని సలహా ఇస్తున్నారు. మొత్తంమీద ‘బ్రోచేవారెవరురా’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ఇలాంటి టాక్ వచ్చిందంటే శ్రీవిష్ణు హిట్టుకొట్టినట్టే!
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xgrTej
No comments:
Post a Comment