హీరో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగస్ట్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇంకా హీరోయిన్లను ఖరారు చేయలేదు. పూర్తి తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా శర్వానంద్‌కు గాయమైంది. దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటకే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. గుబురు గెడ్డంతో ఆయన లుక్ అదిరిపోయింది. శర్వా సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘స్వామి రారా’ సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూరుస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xa5iKZ
No comments:
Post a Comment