మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ను పూర్తిచేసేశారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చిరంజీవి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ఇంకా హీరోయిన్‌ను ఫైనల్ చేయలేదు. చిరంజీవి సరసన ఒక కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల శివ చూస్తున్నట్లు సమాచారం. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. కథతో పాటు దానిలో ఉన్న పాత్రల విషయంలోనూ కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే చిరంజీవి పక్కన చేయబోయే హీరోయిన్ విషయంలో కూడా కొరటాల చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని అంటున్నారు. మెగాస్టార్ వయసుకు, ఇమేజ్‌కు సరిపోయే ఒక కొత్త ముఖం కోసం కొరటాల వెతుకుతున్నారట. వాస్తవానికి చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్‌ను తీసుకోవాలని కొరటాల చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవీ ఆచరణలోకి రాలేదు. కొరటాల కొత్త హీరోయిన్ కోసం చూస్తుండటం వల్లే వీళ్లపై ఆసక్తి చూపలేదని అంటున్నారు. చూద్దాం చిరంజీవి కోసం కొరటాల ఎలాంటి హీరోయిన్‌ను తీసుకొస్తారో! కాగా, ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ILfNAh
No comments:
Post a Comment