Kalki Honest Trailer: కొల్లాపూర్ ఎమ్మెల్యే తమ్ముడి హత్య.. ఇదే ‘కల్కి’ కథాంశం

హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కల్కి’పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ‘పీఎస్‌వీ గరుడవేగ’తో రాజశేఖర్ మళ్లీ ఫాంలోకి రావడంతో ‘కల్కి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికితోడు ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల్లోని ఆసక్తిని మరించి పెంచేందుకు తాజాగా ‘హానెస్ట్ ట్రైలర్’ పేరిట చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి ఈ ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే, డిజిటల్ వర్షన్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇప్పటి వరకు కేవలం యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల్లో ఇంటెన్సిటీని పెంచిన దర్శకుడు ఈ కొత్త థియేట్రికల్ ట్రైలర్‌లో అసలు స్టోరీ లైన్ ఏంటో రిలీల్ చేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్టు ఇప్పటికే దర్శకుడు చెప్పారు. ట్రైలర్ ప్రారంభంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు, ఆ క్రమంలో ఎదురైన సమస్యల ఆధారంగా ఒక అదిరిపోయే థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా, ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌‌లో అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామక్రిష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ, శత్రు, చరణ్‌దీప్ ముఖ్య పాత్రలు పోషించారు. శివాని-శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2LdqNs0

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts