‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో విజయ్ దేవరకొండపై ఉన్న అభిమానం ఖండాంతరాలు దాటింది. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానగనం ఉన్నారు. అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీతా గోవిందం చిత్రాలు తెచ్చిన క్రేజ్‌తో చిత్రాలు ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలౌతున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు రెడీ కాగా.. మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టేశారు. ఇందులో క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండని విఫల ప్రేమికుడిగా కనిపించబోతున్నారట దర్శకుడు క్రాంతి మాధవ్. ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్స్‌ని తీసుకున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్‌లతో పాటు.. బ్రెజిల్ సుందరి ఇజాబెల్లె లైట్ హీరోయిన్స్ తీసుకున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో విజయ్ దేవరకొండతో ఇజాబెల్లె లైట్ దిగిన క్యూట్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరూ నాలుకలు అడ్డంగా కొరికి.. చాలా క్లోజ్‌గా నవ్వుతూ ఉండగా సెల్ఫీకి క్లిక్ మనిపించారు. నేను చాలా లక్కీ.. ఈ రౌడీ నా కో స్టార్ అంటూ ఈ క్యూట్ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఇజాబెల్లె లైట్. ప్రస్తుతం ఈ క్లోజ్ అండ్ క్యూట్ సెల్ఫీని విజయదేవరకొండ ఫ్యాన్స్ షేర్‌లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఉంగరాల రాంబాబు’, ‘ఓనమాలు’ వంటి మంచి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్.. ఈ సినిమాలో విజయ్ చాలా డిఫరెంట్‌గా చూపించబోతున్నారట. విఫల ప్రేమికుడిగా ప్రేమించిన ప్రతి అమ్మాయితో విజయ్‌కు బ్రేకప్ అయిపోతుందని సమాచారం. అందుకే, దీనికి ‘బ్రేకప్’ అనే టైటల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇజాబెల్లె లైట్ ముగ్గురితో విజయ్‌కు బ్రేకప్ అయిపోతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇజాబెల్లె లైట్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ పిక్స్..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2N4YaQn
No comments:
Post a Comment