జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఏం చేయలేడు.. పోసాని సంచలన వ్యాఖ్యలు

పోసాని కృష్ణమురళి.. ఈ పేరులోనే ఒక ఫైర్ ఉంది. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆయనకు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. లోపల ఏమనుకుంటే అది బయటకు వచ్చేస్తుంది. ముక్కుసూటిగా అస్సలు మొహమాటం పడకుండా మాట్లాడే ఇండస్ట్రీకి చెందిన చాలా తక్కువ మందిలో పోసాని ఒకరు. అందుకే ఆయన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది ద్వేషిస్తుంటారు. ప్రస్తుతానికి అయితే టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పోసాని అంటే మండిపడుతున్నారు. కారణం నోటి వెంట జగన్ తప్ప మరో మాట రాకపోవడం. తెలుగు సినీ పరిశ్రమలోకి రచయితగా అడుగుపెట్టిన పోసాని సుమారు 100 సినిమాలకు పనిచేశారు. ఆ తరవాత దర్శకుడిగా మారి తన మార్క్ చూపించారు. ప్రస్తుతం నటుడిగా సెటిలయ్యారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వై.యస్.జగన్‌మోహన్ రెడ్డి ఫాలోవర్‌గా వైసీపీలో చేరారు. జగన్‌ను సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని చాలా సార్లు చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌ కోసం ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇదిలా ఉంటే, జగన్ సీఎం కావడం పట్ల పోసాని చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. శస్త్ర చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోసానిని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ‘టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మీ స్పందనేంటి?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు పోసాని స్పందిస్తూ జూనియర్ ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేయలేడని అన్నారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఎంత నీతిగా, చిత్తశుద్ధితో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా బండి నడవదు. ఒక హీరో వచ్చి ఐ కెన్ బ్రింగ్ స్టార్ ఫ్రమ్ ద స్కై అంటే నమ్మే రోజులు లేవు ఇప్పుడు. బీ ప్రాక్టికల్. హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది. తెలివితేటలు పెరగవు. ప్రజాసేవా దృక్పథం పెరగదు. హీరో ఇమేజ్‌కి, రాజకీయాలకు సంబంధంలేదు. ఇమేజ్‌తో చూడటానికి నాకు వంద మంది వస్తే వాళ్లకు 10వేల మంది వస్తారు. ఈ 10వేల మంది ఓటర్లుగా మారరు. హీరోని తెరపై చూశాం.. రియల్‌గా చూశాం.. ఎలా ఉన్నాడు అని మాత్రమే మాట్లాడుకుంటారు’ అని పోసాని వ్యాఖ్యానించారు. టీడీపీ, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాల్లో తనకు అవకాశాలు తగ్గాయని.. కావాలనే తనను కొంత మంది తప్పిస్తున్నారని కూడా పోసాని చెప్పారు. ‘ఇండస్ట్రీలో ఎక్కువ మంది టీడీపీ వాళ్లు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది చంద్రబాబు ఫ్యాన్స్ ఉన్నారో.. ఎంత మంది టీడీపీని ఇష్టపడతారో మీకు తెలుసు. ఎందుకు ఇష్టపడతారో కూడా మీకు తెలుసు. అది కులమా, ఇంకో కారణం ఉందా అని నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని పోసాని అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మీ సినిమా అవకాశాలపై ప్రభావం చూపిందా? అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ.. ‘ఎలక్షన్ దగ్గరకు రాగానే మా వాళ్లకు నా మీద కోపమొచ్చింది. దీంతో నాకు వేషాలు తగ్గాయి. లేకుండా చేశారు. నాకు జబ్బు రాకముందు కూడా తగ్గాయి. నేనంటే వ్యక్తిగతంగా ప్రేమించే వాళ్లు అవకాశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని తిట్టాడు, చంద్రబాబును తిడుతున్నాడు వాడి వేషం తీసేయ్ అని రాసిన పేరును కూడా కొట్టేసి వేరే వాళ్లను పెట్టారు. పేర్లు చెప్పమంటారా.. మా అశ్వినీదత్తన్న’ అని బాంబు పేల్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WX1JaN

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts