హీరో మరో సినిమాను పట్టాలెక్కించారు. వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నారు. ఇది నితిన్‌కు 28వ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. పూజా కార్యక్రమంలో హీరో నితిన్, హీరోయిన్ ప్రియా వారియర్, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, నిర్మాత ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. చంద్రశేఖర్ ఏలేటితో సినిమా చేస్తుండటం పట్ల నితిన్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సినిమా ప్రారంభమైందని ట్వీట్ చేశారు. ‘నితిన్ 28 ముహూర్తం అయిపోయింది. ఏలేటి చంద్రశేఖర్ గారితో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది!! మొత్తం మీద రకుల్ నేను కలిసి పనిచేస్తున్నాం. ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్‌గా చేస్తోంది. భవ్య ఆనంద్ ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు’ అని తన ట్వీట్‌లో నితిన్ పేర్కొన్నారు. కాగా, ‘ఐతే’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన చంద్రశేఖర్ ఏలేటి తొలి చిత్రానికే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరవాత ఆయన చేసిన సినిమాలన్నీ వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్నవే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుడు సీటుకు అతుక్కుపోయేలా చేయడంలో చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తులు. ఆయన చేసినవి కేవలం ఆరు సినిమాలే అయినా తెలుగులో ప్రతిభ కలిగిన, సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా చంద్రశేఖర్ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకునే చంద్రశేఖర్ మూడేళ్ల విరామం తరవాత ఇప్పుడు నితిన్‌తో సినిమాను ప్రారంభించారు. మరోవైపు, నితిన్ కూడా ఈ మధ్య కాస్త డీలాపడ్డారు. ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ తేడా కొట్టడంతో ఈ ఏడాది ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘భీష్మ’ సినిమాను మొదలుపెట్టారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను నితిన్ పట్టాలెక్కించేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Ky6aHw
No comments:
Post a Comment