ఇండస్ట్రీలో రాణించాలంటే అది తప్పనిసరి.. సాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు.. విజయ్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తప్పనిసరి అంటున్నారు రౌడీ స్టార్ . 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు విజయ్. ప్రస్తుతం ‘’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న ఆయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో ఎప్పుడూ పోటీ వాతావరణమే ఉంటుందని, కేవలం విజయాలు మాత్రమే పరిశ్రమలో మీరు రాణించడానికి సాయపడతాయని చెప్పారు. అద్భుతంగా నటిచాల్సిందే తప్పితే.. ఏదో ఒక సమయంలో మీకు సాయం చేయడానికి కూడా ఎవ్వరూ ఉండరని తెలిపారు. పరిశ్రమలో రాణించడం కోసం తాము ఎంతో కష్టపడ్డామని, అలాగే ‘లైగర్‌’ కోసం హీరోయిన్ అనన్యపాండే ఎంతో శ్రమించారని అన్నారు. ఈ మూవీ విడుదలయ్యాక ఆమెను అంతా ఇష్ట పడతారని చెప్పారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న 'లైగర్' సినిమా కోసం విజయ్ దేవరకొండ పొడవాటి జుత్తుతో ఎంతో స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు. ప్రత్యేకంగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకొని రియలిస్టిక్‌‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్‌ నటుడు మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3neiVaU

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts