పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. దాదాపు రెండున్నరేళ్లుగా ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులకు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ఫెస్టివల్‌ను తీసుకొస్తుంది. భారీ అంచనాలతో అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో ప్రభాస్ చేతి రేఖలను ఆధారంగా చేసుకుని వ్యక్తి భవిష్యత్తును చెప్పేసే విక్రమాదిత్యగా కనిపించబోతున్నారనేది తేట తెల్లమైంది. కాగా.. ఇప్పుడు ఈ సినిమా కథాంశంపై ఓ ఆసక్తికరమైన వార్తొకటి ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. ‘రాధేశ్యామ్’ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. అలాగంటే బయోపిక్ అనొచ్చా అంటే చెప్పలేం. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇంతకీ ఎవరి ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రను తయారు చేసుకున్నారంటే.. విలియం జాన్ వార్నర్ అలియాస్ చెయిరో. ఈయన 19వ శతాబ్దంలో ఐరిష్ దేశానికి చెందిన హస్తసాముద్రికా నిపుణుడు. ఈయనకు సంఖ్యా శాస్త్రంపై కూడా మంచి పట్టుంది. మన భారతదేశంలోనే జ్యోతిశ్యం నేర్చుకున్నాడీయన. 1880 దశకంలో అప్పటి రాజుల మరణాలు, ఇతర విషయాలను కచ్చితంగా లెక్కగట్టి చెప్పి అందరినీ విస్మయానికి గురిచేశారు. చెయిరో జీవితాన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలే రూపొందాయి. ఇప్పుడు కూడా ఆయన జీవితంలోని కొన్ని ఘటనలను బేస్ చేసుకుని దానికి కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కించారని టాక్. మరి ఇందులో నిజానిజాలేంటనేది దర్శకుడు చెప్పాల్సిందే. జోడీగా ఇందులో పూజా హెగ్డే కనిపిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ కూడా ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. జనవరి 14,2022లో సినిమా విడుదలవుతుంది. ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సలార్, ఆదిపురుష్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ సినిమాలు ప్రభాస్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bmeNjK
No comments:
Post a Comment