టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను శనివారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లోనే ప్రమాదవశాత్తు జారి పడ్డారు. అప్పటి నుంచి మందులు వాడుతున్నా పెద్దగా ప్రయోజనం లేకపోగా నిన్న రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న .. టాలీవుడ్ మూడు తరాల హీరోలతో తెరపంచుకున్నారు. సిపాయి కూతురు సినిమాతో 1959లో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత వెండితెరకు దూరంగా ఉంటున్నారు. వయసు మీద పడటంతో ఆనారోగ్య కారణాలతో ఇంటిపట్టునే ఉంటున్నారు కైకాల. గత 60ఏళ్లుగా తెలుగు సినిమా రంగంలో 777 సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసిన ఆయన.. పలు చిత్రాల్లో హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా, నాయకుడిగా ప్రధాన భూమికలు పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా 'నవరస నటనా సార్వభౌమ' అనే బిరుదును ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bujLuR
No comments:
Post a Comment