నందమూరి అభిమానులకు పండగలాంటి వార్త.. అందుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్! అన్నీ సిద్ధం

యంగ్ టైగర్ వరుస సినిమాలు లైన్‌లో పెట్టేశారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్న ఆయన.. తన తదుపరి సినిమాల కోసం షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు RRR పనులతో బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఈ లోగా తాజాగా నందమూరి అభిమానులు హుషారెత్తిపోయే ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. RRR వర్క్స్ ఫినిష్ కాగానే కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్.. ఆ వెంటనే ప్రశాంత్‌ నీల్‌ చిత్రాన్ని కూడా ప్రారంభించి సరిపడా డేట్స్ ఇచ్చేస్తారట. ఈ రెండు సినిమాలతో పాటు మరో భారీ మూవీని ఎన్టీఆర్ లైన్‌లో పెట్టారని తెలుస్తోంది. బాలీవుడ్‌ బడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇప్పటికే కథ సిద్ధం చేసిన ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశారట సంజయ్. భారీ ఎత్తున్న ఈ సినిమా నిర్మించాలని, ఎన్టీఆర్‌ని గతంలో ఎన్నడూ చూడనివిధంగా వెండితెరపై ఆవిష్కరించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ భారీ సినిమా కోసం ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అన్నీ కుదిరి ఈ భారీ సినిమా సెట్స్ మీదకొస్తే అదే పెద్ద పండగ అని భావిస్తున్నారు. సో.. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GpT2O6

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts