చైసామ్ విడాకుల ప్రకటన తర్వాత ఈ ఇద్దరి విషయంలో ఎన్నో వార్తలు చూస్తున్నాం. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్ తనపై తప్పుగా ప్రసారం చేసిన వార్తలపై కోర్టుకెళ్లగా ఆమెకు అనువుగా కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నాగ చైతన్య- సమంత విషయమై మరో వార్త తెరపైకి వచ్చింది. సమంత కారణంగా ఓ ప్రాజెక్టు కోల్పోయారనే టాక్ నడుస్తోంది. ఇటీవలే 'లవ్ స్టోరీ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు నాగచైతన్య. అదే జోష్‌లో తన తదుపరి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' మూవీ చేస్తున్న చైతూ.. మరోవైపు తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు'లో తన పోర్షన్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరో పక్క సమంత కూడా 'శాకుంతలం' కంప్లీట్ చేసి మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసి తీర్థయాత్రలు చుట్టి వచ్చింది. ఈ నేపథ్యంలో చైసామ్‌కి సంబంధించిన ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. నాగ చైతన్య చేయబోతున్న ఓ సినిమా విషయంలో కొత్త ప్రాబ్లం తెరపైకి వచ్చింది. డైరెక్టర్ నందినీ రెడ్డితో చైతూ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు సెట్ అయి చాలాకాలం అయిందట. చైసామ్ విడాకుల ప్రకటనకు ముందే అంతా సెట్ చేసుకొని నాగ చైతన్య- సమంత హీరోహీరోయిన్లుగా ఈ మూవీ ప్లాన్ చేసిందట . ఈ క్రమంలో ఉన్నట్టుండి చైసామ్ విడిపోతున్నట్లు ప్రకటించడంతో 'అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి' అన్నట్లుగా ఆమె పరిస్థితి తయారైందట. పోనీ సామ్‌ని పక్కనబెట్టి వేరే హీరోయిన్‌ని తీసుకుందామనే ఆలోచన కూడా చేసిన నందినీ.. సరిగ్గా వర్కవుట్ అవుతోందో లేదో అనే సందేహంలో పడిపోయిందట. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకోవాలనే ప్లాన్ కూడా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సో.. చూడాలి మరి చివరకి ఏం జరుగుతుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GnVViD
No comments:
Post a Comment