కెరీర్ ఆరంభంలో చాక్లెట్ బాయ్‌గా కనిపించిన పోతినేని.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ రోల్స్‌లో కూడా రఫ్పాడించగలనని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో డిఫరెంట్ మూవీ 'రెడ్' చేసి ప్రశంసలందుకున్నాడు. ఈ రెండు సినిమాల్లో తనదైన మాస్ అప్పియరెన్స్‌తో యూత్ ఆడియన్స్‌కి కిక్కిచ్చిన రామ్.. అదే బాటలో తన తదుపరి ప్రాజెక్టు కన్ఫర్మ్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చి తన అభిమానుల్లో ఎనర్జీ నింపాడు రామ్. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌తో రామ్ నెక్స్ట్ మూవీ రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఈ సినిమాకు రాక్ స్టార్ బాణీలు కట్టబోతున్నారనే విషయాన్ని రామ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అఫీషియల్‌గా ప్రకటించాడు. వచ్చే నెలలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. రామ్ శైలి మాస్ ఎనర్జీతో ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించనున్నారని టాక్. ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు సమాచారం. గతంలో రామ్ సినిమాల విజయాల్లో దేవి శ్రీ అందించిన బాణీలు పెద్ద పీట వేశాయి కాబట్టి మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటం పట్ల ఇరువురి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3shD8gA
No comments:
Post a Comment