రామ్ గోపాల్ వర్మ.. పూర్తి స్వేచ్ఛాను అనుభవిస్తూ.. తన ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపే వ్యక్తి. ఇతరలు ఏమనుకుంటారనే భయం ఏమాత్రం లేకుండా తనకు తోచిన పనిని తనదైన స్టైల్‌లో చేసుకుంటూ పోతాడు వర్మ. ఇక వర్మ సోషల్‌మీడియాలో చేసే పోస్ట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షడి నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ వర్మ ట్వీట్లలో ఎవరికీ మినహాయింపు ఉండదు. ప్రతీ ఒక్కరిపై సెటైర్లు వేస్తాడు.. వివాదాల్లో చిక్కుకుంటాడు. మళ్లీ తాను చేసిన ట్వీట్‌కి భిన్నంగా మరో ట్వీట్ చేసి.. ఫాలోవర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇది రామ్ గోపాల్ వర్మకు నిత్యకృత్యంగా మారింది. తన లైఫ్‌లో పీక్స్‌లో సక్సెస్‌ని చూశాడు. ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను తీసి.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ చరగని ముద్ర వేసుకున్న ఆయన.. ప్రస్తుతం అదేస్థాయిలో ఫెయిల్యూర్‌ని అనుభవిస్తున్నాడు. గడిచిన కొన్నేళ్లలో వర్మ తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటంటే ఒక్క సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ లభించలేదు. అయితే ఎక్కడ.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనకు ఏ సందర్భాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు అంటూ తరచూ చెప్తుంటాడు. ‘న్యూ ఇయర్ అంటే కేవలం క్యాలెండర్‌లో డేట్ మారుతుంది కానీ.. మన ఫేట్ మారదు’ అనేది వర్మ ఫిలాసఫీ. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజుని జరుపుకుంటాడా అంటే.. లేదనే సమాధానం వినిపిస్తుంది. ఈ రోజు (ఏప్రిల్ 7వ తేదీ) వర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు. అయితే అందరిలా వారికి ధన్యవాదాలు చెప్పడం వర్మ స్టైల్ కాదు. దీంతో ఆయన ఈ విషెస్‌కి తనదైన శైలీలో స్పందించాడు. ‘ఇది నా పుట్టినరోజు కాదు.. మరణించిన రోజు. ఎందుకంటే ఈ రోజుతో నా జీవితంలో ఓ సంవత్సరం మరణించింది’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘నువ్వు దేవుడివి సామీ’, ‘నీలాగా ఎవరూ ఆలోచించలేరు’ అంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, వర్మ ప్రస్తుతం తనకు ఎంతో కలిసొచ్చిన హారర్ జోనర్‌లో ఓ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. ‘ఆర్‌జీవీ దెయ్యం’ ఓ సినిమాని ఈనెల 16వ తేదీన ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరీ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fP8iJu
No comments:
Post a Comment