‘పుష్ప’ వాయిదా? ఆందోళనలో అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఆచార్య, నారప్ప ఇతర చిత్రాల పరిస్థితేంటి?

మాయదారి కరోనా మళ్లీ పంజా విసరడంతో ఇండస్ట్రీలో వాయిదాల పర్వం మొదలైంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసి విడుదల తేదీలను ప్రకటించిన చిత్రాలు దిక్కుతోచని పరిస్థితుల్లో వాయిదాల బాట పట్టాయి. నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాట పర్వం’, నాని ‘టక్ జగదీష్’ చిత్రాలు వాయిదా వేసుకున్నారు. ఇక చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్‌ ‘నారప్ప’, బాలకృష్ణ ‘అఖండ’, రవితేజ ‘ఖిలాడి’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ రిలీజ్ డేట్‌లు ఫిక్స్ కాగా నిర్మాతల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం ‘’ విడుదలపై సందిగ్ధత నెలకొంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం పుష్ప ఆగష్టు 13న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా భయంతో ఇప్పటికే సగానికి సగం మంది ప్రేక్షకులు థియేటర్‌కి రావడానికి భయపడుతున్నారు. పైగా ఓటీటీ కొత్త సినిమాలు వారం రెండు వారాల్లో వచ్చేస్తుండటంతో థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ఉద్ధృతి తగ్గకపోతే మళ్లీ యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలకి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే సినిమాలను వాయిదా వేసుకోవడం కంటే ఉత్తమమైన మార్గం మరోటి ఉండదు. 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడే కలెక్షన్లు ఓ మోస్తరుగా వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ 50 పర్సంట్ ఆక్యుపెన్సీ (సీటు వదిలి సీటు) అంటే కలెక్షన్స్ సగానికి సగం పడిపోతాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రాలను విడుదల చేసి క్యాష్ చేసుకోవడం అంటే కత్తిమీద సామే. అందుకే వాయిదా వేసుకోవడం తప్ప మరో మార్గం లేదనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇక పుష్ప మూవీ ముందుగా ప్రకటించనట్టుగా ఆగష్టు 13న విడుదల కావడం కష్టంగానే అనిపిస్తుంది. ఓవైపు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ కాకపోవడం ఒక కారణమైతే.. కరోనా వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. దీంతో పుష్ప విడుదల మరో నాలుగు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగష్టు నుంచి డిసెంబర్ నెలకు పుష్ప షిఫ్ట్ కావచ్చు. ఆగష్టు 13 తేదీని వాయిదా వేసి డిసెంబర్ 17న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. ఇదే జరిగితే బన్నీ ఫ్యాన్స్‌కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక కరోనా పరిస్థితుల్లో విడులైన వకీల్ సాబ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.. ఆ వివరాలు ఈ కింది కథనంలో తెలుసుకోండి..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qo6yMW

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts