దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఎక్కడ చూసినా గతేడాది కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ కరోనా టెస్ట్ చేయించుకున్నారని, రిపోర్ట్ ప్రకారం ఆయనకు పాజిటివ్ అని తేలిందని తెలుస్తుండటం మెగా ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్' యూనిట్ సభ్యులతో పాటు తన భద్రత సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పవన్ కళ్యాణ్ కూడా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లిన సంగతి మనందరికీ తెలుసు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది కూడా. వైద్యుల సూచన మేరకు గడప దాటకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా తనకు, జనసేన పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకున్నారు పవన్. ఈ పరిస్థితుల నడుమ పవన్ కళ్యాణ్ కోవిడ్ టెస్టులు చేయించుకోవడం చర్చనీయాంశం అయింది. గత రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్ పరీక్షలు చేయించుకున్నారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్‌కి కరోనా పాజిటివా లేక నెగెటివా? అనేది ఇటు ఆసుపత్రి వర్గాలు కానీ, అటు జనసేన పార్టీ వర్గాలు కానీ అఫీషియల్‌గా ప్రకటించకపోవడంతో మెగా ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. కాగా మరోవైపు పవన్‌కి కోవిడ్ పాజిటివ్ అని సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32iQm1Z
No comments:
Post a Comment