
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక వరించింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా రజనీకాంత్ నిలిచారు. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. "సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించ దగినవి. రజనీకాంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు" అని ప్రకాశ్ జావడేకర్ ట్వీట్ చేశారు. రజనీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తుంటారు. గతంలో దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్, రామానాయుడు, బాలచందర్, కె. విశ్వనాథ్ లాంటి వారు ఈ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను కూడా ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PHvOgG
No comments:
Post a Comment