అది జరిగి ఎనిమిదేళ్లు.. మాజీ భర్త అంటూ పవన్ కళ్యాణ్‌పై రేణూ దేశాయ్ కామెంట్స్

వ్యవహారం సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె చేసే కామెంట్లు, షేర్ చేసే ఫోటోలు, వ్యక్తపరిచే భావాలు, అభిప్రాయాలు అన్నీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రేణూ దేశాయ్ నిత్యం ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. నుంచి విడిపోయాక రేణూ దేశాయ్‌కి సోషల్ మీడియాలో చేదు అనుభవాలు ఎదురవుతూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి వేరు పడ్డాక గురించి ఆలోచనలు చేశారు. అలా రెండో పెళ్లికి రేణూ దేశాయ్ సిద్దమవ్వడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో రేణూ దేశాయ్ అభిమానులపై ఫైర్ అయ్యారు. నన్ను రెండో పెళ్లి చేసుకోవద్దని అంటున్నారు.. మరి అదే విషయాన్ని మీ హీరో పవన్ కళ్యాణ్‌కు ఎందుకు చెప్పరు అంటూ అందిరినీ నిలదీశారు. అయితే రెండో పెళ్లి అంటూ ఓ అడుగు ముందుకు వేసి తనకు నిశ్చితార్థం జరిగిందనే సంకేతాలను ఇస్తూ రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అంటూ రేణూ దేశాయ్‌కి ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. అలా మొత్తానికి రెండో పెళ్లి విషయాన్ని కాస్త వాయిదా వేశారు. కానీ తాజాగా మళ్లీ ఆ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా రేణూ దేశాయ్ తన చేతిని, వేలికి ఉన్న ఉంగరాన్ని పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో కవిత్వం చెప్పేశారు. అలా ఓ పోస్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ మళ్లీ రెచ్చిపోయారు. రెండో పెళ్లి గురించి కామెంట్ చేశారు. అయితే అందులో ఓ నెటిజన్ మాత్రం రేణూ దేశాయ్ ఉంగరంపై కామెంట్ చేశాడు.అది పవన్ కళ్యాణ్ గారు బహుమతిగా ఇచ్చారని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు. దానిపై రేణూ దేశాయ్ కాస్త సీరియస్ అవుతూ సెటైర్ వేశారు. అందులో ఎలాంటి నిజం లేదు.. అది నా కష్టార్జితంతో కొనుక్కున్నాను. అది నా మాజీ భర్త (పవన్ కళ్యాణ్) కొనిచ్చాడని మీరు అలా ఎలా ఊహించుకుంటారు? విడాకులు అయిన ఎనిమిదేళ్లు అవుతున్నాయ్.. అలాంటి స్థితిలో ఆయన ఇచ్చిన ఉంగరాన్ని నేను ఎలా పెట్టుకుంటాను.. మీలాంటి వారంతా ఇంకాస్త ఎదగాలి.. ఇంకాస్త సున్నితత్త్వంగా మారాల్సి ఉంది అంటూ కౌంటర్ వేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32qN6Su

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts