ఎద అందాలు షేక్ చేస్తూ ఇలియానా రచ్చ.. అదే టార్గెట్‌గా దడ పుట్టించిన గోవా బ్యూటీ.. వీడియో వైరల్

అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల మదిలో ఇలియానాకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది. అయితే ఇప్పుడు డౌన్ ఫాల్‌లో ఉన్నా, సినిమాలేవీ హిట్ కాకపోయినా, అంతగా అవకాశాలు రాకపోయినా కూడా ఇలియానా ట్రెండింగ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఇలియానా షేర్ చేసే ఫోటోలు మంట పెడుతుంటాయి. అసలే జీరో సైజ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఇలియానా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తుంటారు. ఇలియానా అందాల విందుకు నెటిజన్లు షాక్ అవుతుంటారు. దాదాపు దశాబ్దం క్రితం ఇలియానా హవా ఓ రేంజ్‌లో కొనసాగింది. దేవదాస్, పోకిరి, జల్సా వంటి చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా తన సత్తాను చాటారు. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారారు. రవితేజ, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల పక్కన నటించి భారీ హిట్లు కొట్టేశారు. అయితే నితిన్, తరుణ్ వంటి హీరోలతో చేసిన సినిమాలేవీ అంతగా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ బాట పట్టేశారు. బాలీవుడ్‌లో మాత్రం ఇలియానాకు చేదు అనుభవమే ఎదురైంది. ఇప్పటి వరకు సరైన సక్సెస్ కొట్టలేకపోయారు. బర్ఫీ, రుస్తుమ్ వంటి చిత్రాల్లో మంచి నటనను కనబర్చారు. కానీ అవేవీ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో ఇలియానాకు ఎదురుదెబ్బలు తగిలాయి. అలా మళ్లీ టాలీవుడ్ వైపు ఆశగా చూశారు. కానీ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడదామని ప్రయత్నించిన ఇలియానాకు డిజాస్టర్లు ఎదురయ్యాయి. దీంతో మొత్తానికి టాలీవుడ్ ఊసు కూడా ఎత్తడం లేదు. మధ్యలో ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడటం, పీకల్లోతు ప్రేమలో మునగడం ఆ తరువాత బ్రేకప్ అన్నీ కూడా జరిగిపోయాయ్. ఇప్పుడు ఇలియానా ఒంటరిగా ఉంటున్నారు. ఈ మధ్యే బిగ్ బుల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది ఆశించినంత విజయం సాధించలేదు. అయితే సినీ కెరీర్ ఎలా ఉన్నా కూడా ఇలియానా మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంటారు. అందాల వడ్డనతో అందరినీ కట్టిపడేస్తుంటారు. నిత్యం వర్కవుట్లు చేస్తూ తన ఫిట్ నెస్ మంత్రాన్ని అందరికీ చెబుతుంటారు. తాజాగా ఇలియానా షేర్ చేసిన ఫోటోలు, వింత ఫోటో షూట్ వైరల్ అవుతోంది. ఎద అందాలను షేక్ చేస్తూ ఇలియానా షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ప్రస్తుతం ఇలియానా వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x5ysOy

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts