పవన్‌ని అందుకే విమర్శించా.. అమ్మాయిని వర్జిన్‌వా అని అడగడం బాధగా అనిపించింది: ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు నటించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ ‘’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. ఈ పాత్ర గురించి, తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు గత చిత్రాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నేను, పవన్ కలిసి నటించిన ‘బద్రి’ సినిమాలో ‘నంద’ పాత్ర అలా వారికి బాగా గుర్తుండిపోయింది. వకీల్‌సాబ్‌లో నా పాత్రకు నందగోపాల్ అని పెట్టగానే ప్రేక్షకులు ‘బద్రి’ టైమ్‌కు వెళ్లిపోయి కనెక్ట్ అయ్యారు. కావాలనే దర్శకుడు నా క్యారెక్టర్ కు నందా అని పెట్టారు. కథ చెప్పడం కాదు ప్రేక్షకులకు వినోదాన్ని కూడా అందించాలి. నందాజీ, నంద గోపాల్ అని పవన్ నన్ను పిలిచినప్పుడు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు చాలా దగ్గరైన కథ ఇది అని ప్రకాష్ అన్నారు. ‘‘మహిళల గురించి సినిమా చేసినా మనకు సాంగ్స్, ఫైట్స్ కావాలి. పవన్ ఇమేజ్‌కు అనుగుణంగా సినిమా చేస్తూనే.. అవన్నీ చేర్చారు. దర్శకుడు ష్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక సినిమాలో నటుడు బాగా నటించాడు అంటే కథ, సంభాషణలు, సందర్భాలు ఇవన్నీ కుదరాలి. అన్నీ బాగున్నప్పుడు అందులో మా నటన ఎలివేట్ అవుతుంది. ప్రకాష్ రాజ్ లేకపోతే సినిమా లేదు అనేది అబద్ధం. అలా ఎవరైనా అంటే అది వాళ్ల ప్రేమ అనుకుంటాను. వకీల్‌సాబ్ సెట్‌కు వస్తే నిజంగా కోర్టుకు వచ్చినట్లే అనిపించేది’’ అని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా తనకి పవన్‌కి భిన్నాభిప్రాయాలు ఉన్నా.. సమాజం పట్ల ఉండే ఆలోచన ఒకటే అని ప్రకాష్ అన్నారు. ‘‘పవన్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్‌తో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు. పవన్ ఒక లీడర్. ఆయన్ను ప్రేమిస్తాను కాబట్టే పవన్ అలా ఉండాలి అని కోరుకుంటాను. సెట్‌లో నాకు పవన్ గారికి మధ్య మంచి చర్చలు సాగేవి. ప్రొటెస్ట్ పొయెట్రీ కర్ణాటకలో ఎలా ఉంటుంది నాకు పుస్తకాలు కావాలి అని ఆయన నన్ను అడిగారు. అలాగే నా దోసిట చినుకులు పుస్తకాలు చదివి పవన్ మీ ఐడియాలజీ బాగుంది అన్నారు. మా మధ్య ఇలాంటి చర్చలు సెట్స్‌లో చాలా జరిగాయి. పవన్, నాకు సమాజం పట్ల, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళల గురించి ఇంకా సినిమాలు రావాలి’’ అని తెలిపారు. ఇక ఈ సినిమాలో క్యారక్టర్ ప్రకారం నటించినా.. లోపల బాధగానే అనిపించిందని ఆయన అన్నారు. ‘‘నేను ఈ సినిమాలో అమ్మాయిల్ని బాధ పెడుతూ ప్రష్నించాను. ఆర్ యూ వర్జిన్ అని అడిగినప్పుడు బాధగా అనిపించింది. అయితే నేను నటుడిని, నా క్యారెక్టర్ ప్రకారం నటించాను. కానీ లోపల బాధగానే అనిపించింది. ఈ చిత్రంలో నివేదా, అంజలి, అనన్య ముగ్గురూ చాలా సహజంగా నటించారు. ప్రస్తుతం నేను ఐదు భాషల్లో నటిస్తున్నాను. తమిళ, కన్నడ, హిందీతో చూస్తే తెలుగులో కొంత సినిమాలు తగ్గినట్లు అనిపించవచ్చు. కేజీఎఫ్, మేజర్, వకీల్ సాబ్, తమిళంలో సూర్యతో నటిస్తున్నా. ఇలా చాలా బిజీగానే ఉన్నాను. నేను అందరికీ కావాల్సిన నటుడిని కదా. నేనూ ఎవర్నీ వదులుకోలేను’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dWM31P

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts