అంటే ఎంత క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఎలాంటి అల్లరి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టేశారు. సిద్దార్థ్ మల్హోత్రతో ఓ సినిమా చేస్తున్నారు. అంత కంటే ముందుగానే ఉత్తరాది ప్రేక్షకులను ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆకట్టుకున్నారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అయితే రష్మిక స్టేజ్ ఎక్కితే అందరినీ ఎలా ఆకట్టుకుంటారో తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలు, హావభావాలతో అందరినీ కట్టిపడేస్తుంటారు. మొన్న చెన్నైలో జరిగిన 'సుల్తాన్' ఈవెంట్‌లోనూ రష్మిక దంచి కొట్టేశారు. తమిళం అంతా రాకపోయినా కూడా స్టేజ్ మీద అడిగి మరీ మాట్లాడేశారు. కార్తీకి స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేశారు. తమిళంలో కష్టపడి ఎంతో ఇష్టంగా తమిళ అభిమానుల కోసం మాట్లాడేశారు. నిన్న హైద్రాబాద్‌లో జరిగిన సుల్తాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక తన సత్తా చాటారు. ముంబైలో బిజీగా ఉన్నా.. షూటింగ్‌కు ఆలస్యమవుతున్నా కూడా సుల్తాన్ ఈవెంట్ కోసం అర్జెంట్‌గా వచ్చేశారు. అలా త్వరగా మాట్లాడేసి వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంలో ముందుగానే మైక్ అందుకున్నారు. కానీ రష్మిక ముద్దు చేష్టలకు అభిమానులు గోల గోల చేశారు. మైక్ అందుకున్న రష్మిక అక్కడికి వచ్చిన ప్రేక్షకులను మాస్క్ ఏది.. సోషల్ డిస్టెన్స్ ఏది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత కార్తీ గురించి, సుల్తాన్ గురించి కాసేపు ప్రసగించారు. కార్తీ, సుల్తాన్ టీం నన్ను చెన్నైలో బాగా చూసుకున్నారు. మన హైద్రాబాద్ గురించి అక్కడ బాగా చెప్పాను.. బిల్డప్ ఇచ్చాను.. వారిని బాగా చూసుకోండి మీరు అంటూ తన అభిమానులకు రష్మిక సూచించారు. అలా రష్మిక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటే మధ్యలో సూర్య సూర్య అంటూ అభిమానులు అల్లరి చేశారు. వారితో పాటుగా రష్మిక కూడా సూర్య సూర్య కార్తీ కార్తీ అంటూ నినాదాలు చేశారు. అయితే ఫ్యాన్స్ ఎంత సేపటికీ ఆగకపోవడంతో.. అరేయ్ నన్ను మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతుందిరా.. మళ్లీ వెళ్లాలి అంటూ రష్మిక తన అభిమానులను తియ్యగా వేడుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39yXYS3
No comments:
Post a Comment