వీరాభిమానిని, పవన్ అంటే పడి చచ్చేవాడిని.. ఇంకా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ పబ్లిక్‌గా గొంతుచించుకొని అరిచే తాజాగా ఏపీ ప్రభుత్వ తీరుపై రియాక్ట్ అవుతూ టాలీవుడ్ పెద్దలపై ఆటం బాంబ్ వేసేశాడు. పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ విషయంలో ఇంత జరుగుతున్నా సినీ పెద్దలెవ్వరికీ పట్టదా? అన్నట్లు ట్వీట్ చేస్తూ ఇష్యూని హాట్ టాపిక్ చేశాడు. దీంతో బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట రచ్చ రచ్చగా మారింది. మూడేళ్ల రాజకీయ ప్రయాణం చేశాక 'వకీల్ సాబ్' రూపంలో మరోసారి వెండితెరపై కనిపించారు పవన్ కళ్యాణ్. సామాజిక నేపథ్యంలో రూపొందిన కథాంశంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా కారణం చూపుతూ తొలిరోజే ఈ సినిమాకు షాకిచ్చింది ఏపీ ప్రభుత్వం. బెనిఫిట్ షోస్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకొని పవన్ అభిమానులకు కోపం తెప్పించింది. మరోవైపు 'వకీల్ సాబ్' టికెట్ల ధరల పెంపు విషయమై గత రెండు రోజులుగా తీవ్ర వివాదం చోటు చేసుకొని కోర్టు వరకూ వెళ్లింది. దీంతో ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లను పెంచొద్దని హైకోర్టు ఆదేశించింది. అలా 'వకీల్ సాబ్' చిత్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించకపోవడంతో ఓపెనింగ్ కలెక్షన్స్‌పై ప్రభావం పడుతోంది. అయితే సినిమా వేరు, రాజకీయం వేరు కదా.. అయినా ఏపీ ప్రభుత్వం ఒక్క వకీల్ సాబ్ విషయంలోనే ఎందుకింత పట్టు బడుతోంది? సినిమాను రాజకీయం చేస్తున్నారా? అనే చర్చలు జనాల్లో ముదిరాయి. తెలంగాణ రాష్ట్రంలో లేని ఇబ్బందులు ఏపీలో ఎందుకొస్తున్నాయి? అనేది హాట్ టాపిక్ అయింది. అయితే ఈ పరిస్థితులపై ఇప్పటిదాకా టాలీవుడ్ నుంచి చిరంజీవి సహా ఏ ఒక్కరూ రియాక్ట్ కాలేదు. ఏ పెద్ద సినిమాకూ వర్తించని రూల్స్ ఒక్క వకీల్ సాబ్ విషయంలోనే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించలేదు. దీంతో ఈ సీన్ చూసి తట్టుకోలేక చిర్రెత్తే కోపంతో బండ్ల గణేష్ బ్లాస్ట్ అయ్యాడు. వకీల్ సాబ్ ఇష్యూపై ఓ మీడియా సంస్థ రాసిన ఆర్టికల్ షేర్ చేస్తూ 'వకీల్ సాబ్.. ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా?' అంటూ కామెంట్ చేశాడు. దీంతో బండ్ల గణేష్ ట్వీట్ ఆన్‌లైన్ వేదికపై రచ్చ చేస్తోంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ పెద్దఎత్తున రియాక్ట్ అవుతూ జగన్ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. 'మొన్న కర్ణాటక ప్రభుత్వం సడన్‌గా 50% ఆక్యుపెన్సీ అని అనౌన్స్ చేస్తే మొత్తం కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక్కటై వ్యతిరేకించారు. కానీ వకీల్ సాబ్ విషయంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీ నుంచి కనీస స్పందన లేదు' అని కొందరంటుండగా.. 'తెలుగు సినిమాలకు కష్టం వస్తే మెగాస్టార్ గారే ముందుకు రావాలా? ఇంకా ఎవడు లేడా ఇండస్ట్రీలో. ఎన్నిరోజులు ఇలాగ భయపడాలి రౌడీ రాజకీయ నాయకులకు. ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంది మాకు చెప్పుకునే హీరోలు కూడా ఉన్నారు వాళ్ళు రారు.. వాళ్లకు ఏమైనా ఐతే మాత్రం మొదట ఉండేది కళ్యాణ్ గారు, చిరంజీవి గారు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ ఇంకాస్త ముదిరింది. చూడాలి మరి బండ్ల గణేష్ ట్వీట్‌పై తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందిస్తారా? లేదా అనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mAAzoJ
No comments:
Post a Comment