చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను పిలిచా.. హీరో ప్రదీప్ అనగానే నాలో! ఎంట్రీలోనే ఈలలు కొట్టించిన యాంకర్

ఇన్నాళ్లు బుల్లితెరపై తనదైన మాటలతో మ్యాజిక్ చేసిన యాంకర్ ఇక వెండితెరపై అలరించబోతున్నాడు. ప్రదీప్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన అన్ని అప్‌డేట్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం జనవరి 29న థియేటర్స్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రదీప్. ఈ మూవీతో సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఎస్‌.వి. ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై క‌న్నడలో ప‌లు విజయవంతమైన సినిమాలు తీసిన ఎస్‌.వి.బాబు నిర్మాతగా వ్యవహరిచారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. టాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థలు అయిన జీఏ2, యూవీ క్రియేష‌న్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ ఆసక్తికరంగా మాట్లాడాడు. స్టేజ్ మీదకు రావడం రావడమే చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు తీస్తూ అభిమానులతో ఈలలు కొట్టించాడు ప్రదీప్. ఎన్నో ఫంక్షన్స్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ లాంటి హీరోలను స్టేజ్ మీదకు రావాలని కోరుతున్నామని పిలిచా.. కానీ మొదటిసారి హీరో ప్రదీప్ అని అనగానే ఈ ఫంక్షన్‌లో నేను టెన్షన్ పడుతున్నా అని చెప్పాడు ప్రదీప్. ఇన్నాళ్లు బుల్లితెరపై తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అన్నాడు. ఈ స్టేజ్‌పై ఇలా నిల్చోవడానికి పదేళ్లు పట్టినా, నాకైతే అది చాలా తవ్వ టైమ్ లాగా అనిపిస్తోందని చెప్పిన ప్రదీప్.. ఈ ? సినిమా మొదలవుతున్నపుడు తనలో ఆనందం, భయం, సంతోషం కలిగాయని చెప్పాడు. నన్ను నమ్మి దర్శకనిరతాలు ఈ సినిమాలో తీసుకోవడం ఆనాదమేసిందని, అలాగే ఈ చేస్తుంటే అందరికీ నచ్చేలా చేస్తానా? లేదా అనే భయమేసిందని అన్నాడు. ఇక 'నీలి నీలి ఆకాశం' పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వేసిందని చెప్పాడు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెల్స్ అని, తనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాట ఇచ్చాడని ప్రదీప్ అన్నాడు. అలాగే చిత్రయూనిట్ మొత్తం చాలా కష్టపడి పనిచేశారని చేస్బుతూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాడు ప్రదీప్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39lJTb5

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts