యంగ్ రెబల్ స్టార్ వరుసపెట్టి భారీ సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘రాధే శ్యామ్’ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే పూర్తికానున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాల దర్శకనిర్మాతలు వేగం పెంచారు. ఇందులో భాగంగా ప్రభాస్- ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న '' మూవీ నుంచి ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసేలా ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించనుందని అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. 'సలార్'లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకున్న ప్రశాంత్ నీల్.. పలువురు బాలీవుడ్ బ్యూటీలను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ శృతి హాసన్‌ని ఫిక్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మేరకు శృతి హాసన్ పుట్టినరోజున (జనవరి 28) ఈ విషయం అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. 'సలార్‌లోకి స్వాగతం. మిమ్మల్ని తెరపై చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ 'సలార్' సినిమాను నిర్మిస్తోంది. ఈ నెల 15న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి (జనవరి 29) జరగనుంది. ఇందులో ప్రభాస్ జాయిన్ కాబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ఓ పవర్‌ఫుల్ యాక్షన్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో విలన్ రోల్‌లో మరో స్టార్ హీరో మోహన్‌లాల్ కనిపించనున్నారని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. మళ్ళీ ఆమె బిజీ హీరోయిన్ కావడం ఖాయమే అని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజతో 'క్రాక్' హిట్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో నటిస్తోంది. ఇప్పుడు ప్రభాస్‌తో కూడా రొమాన్స్ చేసే ఛాన్స్ పట్టేసింది. సో.. చూడాలి మరి శృతి వెండితెరపై ఎలా దూసుకుపోతుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qYUXAQ
No comments:
Post a Comment